
సాదత్ అలీ అనే క్యాబ్ డ్రైవర్.. గుర్తున్నాడా? ఈ ఏడాది జూలై 30న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రియదర్శిని యాదవ్ అనే ఓ యువతి చేతిలో నడిరోడ్డుపై 22 చెంప దెబ్బలు తిన్నాడు. అప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా సాదత్ అలీ ఉత్తరప్రదేశ్ రాజీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే అలీ రాజకీయ పార్టీలో చేరికపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా అన్యాయంగా యువతుల చేతిలో తీవ్రమైన వేధింపులకు గురైన పురుషులకు కోసం తన గళాన్ని వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.
చదవండి: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’
దాంతో పాటు క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలుస్తానని చెప్పారు. చాలా చోట్ల పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. అందుకు తనపై యువతి చేసిన దాడి ఘటన ఓ నిదర్శమని అన్నారు. ఆ ఘటనలో తనకు ఇంకా న్యాయం జరగలేదని, న్యాయం జరిగితే.. తనలా వేధింపులకు గురవుతున్న పురుషులకు అండగా నిలిచి, సాయం చేస్తామని తెలిపారు.
ఇప్పటికీ సాదత్ అలీకి న్యాయం జరగలేదని.. అందుకోసమే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో అడుగుపెట్టారని అలీ తరఫు లాయర్ మీడియాకు వెల్లడించారు. సాదల్ అలీ చేరిన ఈ పార్టీని మాజీ ముఖ్యమంత్రి ములయం సింగ్ యాదవ్ సోదరుడు శివ్‌పాల్ సింగ్ స్థాపించిన విషయం తెలిసిందే. నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్.. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చాడని సోషల్ మీడియాలో చర్చసాగుతోంది.
Ye lo pura video isme ladke ki galti hogi to batana pic.twitter.com/gumOCP6LAz
— Neeraj Yadav 🇮🇳 (@thekingneeraj1) August 2, 2021