కొత్త కోణం: అమ్మాయిల కోసమే భూదేవి హత్య! పావుగా మానసిక స్థితి బాగోలేని సాయితేజ

Friends Behind Saroor Nagar Adopt Son Mother Murder Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సరూర్‌నగర్‌ తల్లి, దత్తపుత్రులు హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.  దత్తత తీసుకుని పెంచిన తల్లి భూదేవిని.. సాయి తేజ చంపడానికి స్నేహితుడు శివ పురిగొల్పడమే కారణమని తేలింది. 

మానసిక స్థితి సరిగాలేని సాయిని.. పెంపుడు తల్లి హత్యకు పురిగొల్పింది శివ అనే విషయం తాజాగా వెలుగు చూసింది. అమ్మాయిల కోసమే భూదేవిని శివ హతమార్చినట్లు వెల్లడైంది. అమ్మాయిలకు ఖర్చు పెట్టడానికే భూదేవి హత్యకు సాయిని పురిగొల్పిన శివ.. ఆపై నగదు, నగల దోపిడీకి పాల్పడ్డాడు. ఆపై హత్య విషయం ఎక్కడ బయటపడుతోందనని చివరకు స్నేహితుడైన సాయిని కూడా చంపేశాడు శివ. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. 

ఇక ఈ హత్యలకు డ్రైవర్ నరసింహ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. భూదేవిని నలుగురు నిందితులు కలిసి చంపినట్లు ధృవీకరించారు పోలీసులు. అయితే సాయి తేజని చంపింది శివ కుమార్ ఒక్కడే వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top