రాహుల్‌ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్‌

Four More Arrested In Rahul Assassination Case - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్‌ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతయ్య, బాబురావు, రాజబాబు, కరణం రమేష్‌లను అరెస్ట్‌ చేశారు. ఇప్పటివరకు 13 మందిలో 11 మంది నిందితులు అరెస్ట్‌ అయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

హత్యకు కారణాలివే..
కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  విజయ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన  ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్‌ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్‌ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్‌ సిలిండర్స్‌ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్‌  రాహుల్‌ను కోరాడు.

అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్‌ స్నేహితురాలు గాయత్రికి రాహుల్‌ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్‌ సిలిండర్స్‌ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్‌ బిజినెస్‌లో కాంట్రాక్ట్‌ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్‌ హత్యకు దారితీశాయి.

ఇవీ చదవండి:
రాహుల్‌ హత్య: చార్జర్‌ వైర్‌తో చంపేశారు
మనబడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top