లిఫ్ట్‌ కూలి అయిదుగురి మృతి | Five People Assassination Due To Lift Accident In Maharashtra | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ కూలి అయిదుగురి మృతి

Jul 25 2021 1:07 AM | Updated on Jul 25 2021 1:12 AM

Five People Assassination Due To Lift Accident In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని వర్లీలో లిఫ్ట్‌ నేలకూలిన ఘటనలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. అందిన వివరాల మేరకు వర్లీ బీడీడీ చాల్స్‌ హనుమాన్‌ గల్లీలోని అంబికా బిల్డర్స్‌ సైట్‌లో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్‌మాన్‌ గల్లీ ప్రాంతంలో అంబికా బిల్డర్స్‌కు చెందిన ఓ భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతుండగానే సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ లిఫ్ట్‌ వేగంగా నేలకూలింది. దీంతో అక్కడ ఉన్నవారు భయాందోళనలతో ఉరుకులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనలో మరణించిన వారిని అవినాష్‌ దాస్‌ (35), లక్ష్మణ్‌ మండల్‌ (35), భరత్‌ మండల్‌ (28), చిన్మయ్‌ మండల్‌ (33)లుగా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. అతని వయసు సుమారు 45 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement