వివాహేతర సంబంధం, మటన్ వ్యాపారి హత్య

సాక్షి, కరీంనగర్: వివాహేతర సంబంధం ఓ మనిషి ప్రాణాలను బలిగొంది. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివారులో మటన్ వ్యాపారి ఎండీ వలీంపాషా ఆదివారం దారుణంగా హత్యకు గురయ్యాడు. తోటి వ్యాపారి సయ్యద్ అప్జల్ తల్వార్‌తో వలీంపాషాపై దాడికి పాల్పడ్డాడు. మెడపై తల్వార్‌తో దాడి చేయడంతో వలీంపాషా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నగరంలోని హుస్సేన్ పురకు చెందిన వ్యక్తి.
అదే ప్రాంతానికి చెందిన ఆప్జల్ భార్యతో వలీంపాషాకు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. హత్యకు పాల్పడిన అప్జల్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మాత్రం అతని అరెస్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. సంఘటనా స్థలాన్ని ట్రైనీ ఐపీఎస్ రేష్మా పెరుమాళ్, ఏసిపి విజయసారథి సందర్శించి విచారణ చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి