సొంత సంస్థకే కన్నం.. రూ .2.30 కోట్లు నొక్కేశారు | Emplyoees Cheated Own Company By Money Forgery In Odisha | Sakshi
Sakshi News home page

సొంత సంస్థకే కన్నం.. రూ .2.30 కోట్లు నొక్కేశారు

Aug 17 2021 2:12 PM | Updated on Aug 17 2021 2:45 PM

Emplyoees Cheated Own Company By Money Forgery In Odisha - Sakshi

కొరాపుట్‌: తిన్నింటి వాసాలే లెక్కపెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. అంతా కుమ్మకై సొంత సంస్థకే టోపీ వేసి, 2.30 కోట్లు నొక్కేసారు. దీనికి సంబంధించిన వివరాలను కొరాపుట్‌ ఐఐసీ ధిరేన్‌కుమార్‌ పట్నాయక్‌ సోమవారం వివరించారు. పట్టణంలోని బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న బ్రాంచి మేనేజర్, క్యాషియర్, సేల్స్‌ మేనేజర్, ఆఫీసు బాయ్‌ కలిసి సంస్థకు చెందిన డబ్బును మాయం చేశారు.

కంపెనీ ఆడిట్‌లో వ్యక్తిగత ఖర్చులు కోసం సొమ్మును దారి మళ్లించినట్లు బయట పడింది. దీంతో యాజమాన్య ప్రతినిధులు కొరాపుట్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులలో ఇద్దరు కొరాపుట్, జయపురం, బరంపురం నకు చెందినవారు. ఈ మేరకు వారందరినీ పోలీసులు అరెస్ట్‌ చేసి, కోర్టుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement