పైన సోపు.. లోపల చూస్తే.. | Drugs Racket Busted Ccb Police Karnataka | Sakshi
Sakshi News home page

పైన సోపు.. లోపల చూస్తే..

Dec 30 2021 5:35 AM | Updated on Dec 30 2021 5:41 AM

Drugs Racket Busted Ccb Police Karnataka - Sakshi

బనశంకరి: ముంబై నుంచి సోప్‌బాక్సుల్లో డ్రగ్స్‌ను తెప్పించి అమ్ముతున్న ముగ్గురు నైజీరియన్లను బుధవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువచేసే ఎండీఎంఏ, కొకైన్, హషిష్‌ నూనె, 5 మొబైల్స్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ తెలిపారు. బిసల్‌ ఎన్‌డూయిసి, ఆడూచి సిల్వెస్టర్, చార్లెస్‌ అనే ముగ్గురు వ్యాపార వీసాపై భారత్‌కు వచ్చి బెంగళూరులో బాగలగుంటె వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటూ డ్రగ్స్‌ దందాకు పాల్పడుతున్నారు. న్యూ ఇయర్‌ రావడంతో నగరంలో జరిగే పార్టీలకు డ్రగ్స్‌ సరఫరాకు ముంబైలోని డ్రగ్‌ డీలర్ల నుంచి సోపులు, షాంపూల బాటిళ్లలో డ్రగ్స్‌ను తెప్పించి ఇంట్లో నిల్వ చేసి విక్రయించసాగారు. సమాచారం తెలిసి దాడి చేసి అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement