దారుణం.. తండ్రిని చంపి ఇంటికి నిప్పంటించిన కూతుర్లు

Daughters Killed Father Property Dispute Telangana Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. కొప్పుల ఆంజనేయులు(75) అనే వ్యక్తిని కన్న కూతుర్లే దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. దీంతో ఆంజనేయులు సజీవ దహనమయ్యాడు. తమకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే ముగ్గురు కూతుర్లు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయం చూసి హతమార్చారు. వీరికి ఆంజనేయులు మనవడు భాను ప్రకాశ్ సహకరించాడు. 

కూతుర్లు, మనవడు కలిసే హత్య చేశారని  గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల క్రితం ఆంజనేయులకు చెందిన ఎకరం భూమి అమ్మగా వచ్చిన రూ.10 లక్షలు ఇవ్వకపోవడంతోనే కుమార్తెలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. రాజంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top