వివాహితకు బిస్కెట్లలో మత్తుమందు, ఆపై | Cyberabad She Team Arrest Man Who Molested Married Woman | Sakshi
Sakshi News home page

నగ్న ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిలింగ్‌

Oct 3 2020 8:18 PM | Updated on Oct 3 2020 9:05 PM

Cyberabad She Team Arrest Man Who Molested Married Woman - Sakshi

ఫోటోలను డిలీట్ చేయాలంటే 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్‌ చేశాడు.

సాక్షి, హైదరాబాద్‌: వివాహితకు మత్తుమందు ఇచ్చి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరరం ఆమె నగ్న ఫొటోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఈ దారుణం కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. శ్రీధర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఓ వివాహితకు మత్తుతో కూడిన బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న వివాహత సృహ కోల్పోయింది. దాంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఫోటోలను డిలీట్ చేయాలంటే 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తం ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.  బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్‌ షీ టీమ్‌ అతన్ని వలపన్ని పట్టుకుంది.

క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన
మాదాపూర్‌లో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్‌ తనతో అభ్యంతరకరంగా వ్యవహరించాడని యువతి ఆన్‌లైన్‌ ఫిర్యాదులో పేర్కొంది. డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో యువతి ఫిర్యాదు చేయగా..  షీ టీమ్స్‌ అతన్ని అరెస్టు చేశాయి. 

ట్యూషన్‌ టీచర్‌ నిర్వాకం
పాఠాలు చెబుతానంటూ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యూషన్‌ టీచర్‌ను సైబరాబాద్‌ షీ టీమ్‌ శనివారం అరెస్టు చేసింది. కూకట్‌పల్లిలో ఈఘటన వెలుగు చూసింది. అభ్యంతరకరంగా వ్యవహరించిన టీచర్ విషయాన్ని తల్లిదండ్రులకు బాలిక ఇదివరకే చెప్పింది. తల్లిదండ్రులు మందలించినా టీచర్‌ తీరు మారకపోవడంతో షీటీమ్‌కు సమాచారం అందించారు. ట్యూషన్‌ టీచర్‌ను అరెస్టు చేసిన షీ టీమ్‌ రిమాండ్‌కు తరలించింది.
(చదవండి: కూతుళ్లను యువకుడి దగ్గరకు పంపుతున్న తల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement