మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్‌

CP Mahesh Bhagwat Says Narcotics Selling Three People Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్బీనగర్ జోన్ పరిధిలో మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు ఎస్ఓటీ పోలీసుల చేతికి చిక్కినట్లు రాచకొండ కమిషనరేట్‌ సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖప​ట్నం ఏజెన్సీ నుంచి తెలంగాణకు హాషిష్ అయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు, రూ.800నగదు, 3 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను పోలీసులు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం లడ్డూ చోరీ

వాటి మొత్తం విలువ రూ.9,80,800ఉంటుదని తెలిపారు. ఈ గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. మళ్లప్పగరి శ్రీకాంత్రెడ్డి(మెదక్), వెంకటేష్(సంగారెడ్డి), కొండలరావు(విశాఖ)లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. గ్యాంగ్‌లోని మరో సభ్యుడు వెంకట్రాజు(విశాఖ) పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరిపై రాజమండ్రిలో కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు నడిపి శిక్ష పడేలా చేస్తామని సీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top