పంటపొలాల్లో శవమై కనిపించిన బాలిక

Cops Says UP Teen Missing For Two Days Body Recovered - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలిక పంటపొలాల్లో శవమై కనిపించింది. యూపీలోని జమాల్‌పూర్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ తిరిగిరాలేదు. ఈ క్రమంలో స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ శివారులోని పంటపొలాల వద్దకు చేరుకోగా బాధితురాలి మృతదేహం కనిపించింది.  దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో విషం డబ్బా కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఎవరైనా బలవంతంగా విషం తాగించారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.(చదవండి: 13 నెలల నరకం.. గర్భవతిగా ఇంటికి)

ఇక పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు స్థానికుల నుంచి సేకరించారు.  అయితే బాలిక తప్పిపోయిన విషయం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడం, శవం దొరికిన తర్వాత కూడా సరైన రీతిలో స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top