‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం | Chittoor District : Fraud With Name Of Kaun Banega Crorepati | Sakshi
Sakshi News home page

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం

Sep 1 2020 7:09 PM | Updated on Sep 1 2020 7:15 PM

Chittoor District : Fraud With Name Of Kaun Banega Crorepati - Sakshi

సాక్షి, తిరుపతి : ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ పేరుతో మహిళను నిలువునా ముంచాడు ఓ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని చెప్పి చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మహిళకు కుచ్చు టోపి పెట్టాడు. రేణిగుంటకు చెందిన ఓ మహిళకు 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని ఫోన్‌ వచ్చింది. తొలుత 35 వేల రూపాలయలు చెల్లిస్తే లాటరీ డబ్బులు అందిస్తామని నమ్మబలికారు. మోసగాళ్ల మాయ మాటలు నమ్మిన మహిళ.. 35వేలను చెల్లించింది. ఆ తర్వాత జీఎస్టీ కోసం మరో 10 వేల రూపాయలు చెల్లించాలని పదేపదే ఫోన్లు చేశారు. దీంతో మహిళకు అనుమానం కలిగి.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement