Case Filed On Teenmar Mallanna For Blackmailing Astrologer In Chikkadpally - Sakshi
Sakshi News home page

రూ.30 లక్షలు డిమాండ్‌.. తీన్మార్‌ మల్లన్నపై కేసు !

Apr 24 2021 7:54 AM | Updated on Apr 24 2021 9:44 AM

Case Filed Against Teenmar Mallanna - Sakshi

సాక్షి, చిలకలగూడ: క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కుమార్‌పై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు.. సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19న తీన్మార్‌ మల్లన్న తనకు ఫోన్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో 20వ తేదీన తనపై తప్పుడు కథనాలు ప్రచురించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 22న పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తీన్మార్‌ మల్లన్నపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ సీఐ నరేష్‌ తెలిపారు. 

చదవండి: వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపేస్తా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement