డ్రైవర్‌ ఉన్మాదం: కారు బానెట్‌పై ట్రాఫిక్‌ పోలీసు

Car Driver Dragged Traffic Police On Bonnet In Delhi - Sakshi

న్యూఢిల్లీ : ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించటమే కాకుండా, ట్రాఫిక్‌ పోలీసు ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించాడో కారు డ్రైవర్. ఈ సంఘటన ఢిల్లీలోని కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీ.. కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి, దౌలా కౌన్‌లోని ఓ రోడ్డుపై ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని ఓ కారును ఆపేందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ కారును ఆపక,‌ ట్రాఫిక్‌ పోలీస్‌పైకి వాహనాన్ని పోనిచ్చాడు. ( సినీ నటుడు సచిన్‌ జోషి అరెస్ట్‌ )

దీంతో పోలీసు కారు బానెట్‌పై పడిపోయాడు. బానెట్‌పై వేళ్లాడుతూ.. కారును ఆపమంటూ అరవసాగాడు. అయినప్పటికి డ్రైవర్‌ కారును ఆపకుండా, పోలీస్‌ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న కనికరం లేకుండా రద్దీ రోడ్డుపై అలాగే పోనిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత సదరు పోలీసు రోడ్డుపై కిందపడిపోగా.. డ్రైవర్‌ కారు వేగాన్ని పెంచి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top