దిల్‌సుఖ్‌నగర్‌ ఏటీఎం లూటీ, మేనేజర్‌కు జైలు

Canara Bank Manager At Dilsukhnagar Jailed For ATM Cash Fraud - Sakshi

రంగారెడ్డి జిల్లా కోర్టులు: కెనరా బ్యాంక్‌ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కెనరా బ్యాంక్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బ్రాంచ్‌లో మేనేజర్‌గా వి.భాస్కర్‌రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్‌లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్‌ భాస్కర్‌రావు ఆధీనంలో ఉండేది.

అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్‌ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్‌ ఎంక్వైరీతో పాటు సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్‌ మేనేజర్‌ భాస్కర్‌రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్‌ పై విధంగా తీర్పునిచ్చారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top