డ్రగ్స్‌ విక్రేతగా మారిన సీఏ విద్యార్థి 

CA Student Arrested In Drugs Case In Bangalore - Sakshi

బెంగళూరు : నగరంలోని తిలక్‌నగరలో పోలీసులు గురువారం దాడి చేసి గుంటూరుకు చెందిన వికట్‌రాజ్‌ (27) అనే విద్యారి్థని అరెస్ట్‌ చేసి 1.2 కేజీల మాదక ద్రవ్యాలు, 3 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. బీకాం పూర్తి చేసిన నిందితుడు సీఏ కోర్సు చదువుతున్నట్లు సమాచారం. ఓ చార్టెట్‌ అకౌంట్‌ కార్యాలయంలో పనిచేస్తూ ఈజీ మనీ కోసం గుంటూరులో తన స్నేహితుడు ప్రవీణ్‌ నుంచి గంజాయి నూనెను తెప్పించి కేజీ రూ.5 – 6 లక్షల వరకు బెంగళూరులోని కోరమంగల, ఎస్‌జీ.పాళ్య, హెచ్‌ఎస్‌ఆర్‌.లేఔట్, జయనగర, జేపీ. నగర తదితర  ప్రాంతాల్లో విద్యార్థులు, పరిచయస్తులకు అమ్మేవాడని తేలింది. కేసు విచారణలో ఉంది.

ఇద్దరు డ్రగ్స్‌ పెడ్లర్లు అరెస్ట్‌ 
యశవంతపుర: నైజీరియా పౌరుడితో పాటు కేరళకు చెందిన డ్రగ్స్‌ పెడ్లర్లను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 25 లక్షలు విలువగల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకున్నారు. యలహంకలో ఇద్దరు నిందితులు మత్తు పదార్థాలు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top