కెనాల్‌లో బస్సు బోల్తా.. 45 మంది మృతి

Bus Falls Into Canal 54 Passengers Onboard Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు కెనాల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మరణించారు.  వీరిలో 20 మంది మహిళలు, 24 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. ఏడుగుర మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం ప్రకారం సిధి నుంచి సత్నాకు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి వంతెనపై నుంచి బస్సు ఒక్కసారిగా నీళ్లలో పడి మునిగిపోయింది.  

ఈ ప్రమాదంపై స్పందించిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిధి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతిచెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఆఫీస్‌ ఓఎస్‌డీ సత్యేంద్ర ఖరే ఓ ప్రకటనలో చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జరగాల్సిన వర్చువల్‌ మీటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ప్రమాద సమయంలో కెనాల్‌లో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో బస్సు వేగంగా కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

చదవండి: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top