MP Bus Accident: Bus Accident in Madhya Pradesh: Bus Plung Into Narmada river - Sakshi
Sakshi News home page

MP Bus Accident: మృత్యు కేళి: వంద అడుగుల పైనుంచి నర్మదా నదిలో పడిన బస్సు

Jul 18 2022 11:50 AM | Updated on Jul 18 2022 12:41 PM

Bus Accident in Madhya Pradesh: Bus Plung Into Narmada river - Sakshi

వేకువ ఝామునే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మధ్యప్రదేశ్‌లో.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం వేకువ ఝామున ఖాలాఘాట్‌ దగ్గర అదుపు తప్పి ఓ ప్రయాణికుల బస్సు నర్మదా నదిలో పడిపోయింది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది బస్సు.  ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ.. సంఖ్యపై ఇంకా సరైన స్పష్టత రాలేదు.

ఇప్పటిదాకా 12 మంది మృతదేహాలు లభ్యం కాగా, కొందరిని రక్షించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బస్సు.. ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement