నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ కిడ్నాప్ కలకలం

BJP Parliamentary Secretary Kidnap Case In Nellore - Sakshi

కృష్ణాజిల్లా: విజయవాడ పెనమలూరు పీఎస్‌ పరిధిలో బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ వినోద్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది. తన భర్తను నిన్నరాత్రి (ఆదివారం) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ప్రశాంతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్‌ అనే వ్యక్తి నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా సిల్వర్‌ కలర్‌ కారులో  వినోద్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్‌ చేశారని వినోద్‌ భార్య.. ప్రశాంతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

చదవండి:  ఆటో ఎక్కిన పాపానికి సామూహికంగా ఆమెపై..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top