భార్గవ రామ్‌, భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిపై మరో కేసు

Bhuma Akhula Priya Husband Fake Covid Report, Another Case Has Been Filed - Sakshi

భార్గవరామ్, జగత్‌విఖ్యాత్‌లపై మరో కేసు

కోవిడ్‌ సోకిందని నకిలీ పత్రాల సమర్పణ

సాక్షి, కంటోన్మెంట్‌: బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్‌ కేసులో కీలక నిందితులైన భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, భార్గవ్‌రామ్‌లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్‌ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్‌ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

బోయిన్‌పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్‌ రావు సోదరుల కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్‌ సోకిందని భార్గవరామ్‌ పోలీసులకు వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్‌ ద్వారా సికింద్రాబాద్‌లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు.

పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్‌ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్‌కు సహకరించిన జగత్‌ విఖ్యాత్‌తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్‌ టెక్నీషినయన్‌ శ్రీదేవి, గాయత్రిల్యాబ్‌లో పనిచేసే రత్నాకర్‌లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్‌లను రిమాండ్‌కు తరలించారు. భార్గవరామ్, జగత్‌విఖ్యాత్‌ పరారీలో ఉన్నారు. కిడ్నాప్‌ కేసులో బెయిల్‌పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top