Banjara Hills Police Arrested House Owner For Sexually Assaulting Women Maid - Sakshi
Sakshi News home page

పని మనిషిపై లైంగిక దాడికి పాల్పడ్డ యజమాని అరెస్టు

Mar 10 2021 3:22 PM | Updated on Mar 10 2021 5:21 PM

Banjara Hills Police Arrested House Owner Who Molested Domestic Worker - Sakshi

రెండు వారాల పాటు ప్లాట్‌లో బంధించి భౌతికంగా హింసిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన బాధిత మహిళ రాజమండ్రిలో ఉన్న తన కూతురికి ఫొన్‌ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది.

సాక్షి, బంజారాహిల్స్‌: ఇంట్లో పని కోసం కుదుర్చుకున్న పని మనిషిపై లైంగిక దాడికి పాల్పడిన బంజారాహిల్స్‌కు చెందిన పొన్నుగోటి ఉదయ భాను(52) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 17న ఉదయ భాను రాజమండ్రికి చెందిన ఓ  మహిళ(45)ను వంట పని, ఇంటి పని కోసం అని చెప్పి రప్పించుకుని ఆమెను రెండు వారాల పాటు ప్లాట్‌లో బంధించి భౌతికంగా హింసిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన బాధిత మహిళ రాజమండ్రిలో ఉన్న తన కూతురికి ఫొన్‌ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది.

దీంతో భాదిత మహిళ కూతురు 100 ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో బంజారాహిల్స్‌ పోలీసులు అపార్టుమెంటుకు చేరుకొని 19వ అంతస్తులో ఉన్న బాధితురాలిని రక్షించారు. అనంతరం ఉదయ భానును అదుపులోకి తీసుకని అతడిపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేగాక గతంలోనూ నిందితుడు పలు వివాదాల్లో ఉన్నట్లు పోలీసుల పేర్కొన్నారు. ఇదివరకు కూడా అతడు అధికార పార్టీకి చెందిన పెద్దలు తనకు బంధువులంటూ దబాయిస్తూ ఎమ్మల్యేలు, సినీ ప్రముఖులతోనూ దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి. కాగా ఇవాళ ఉదయభానుని రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: 
పని మనిషిని ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా...
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement