సెలవుల సమయంలో ఇంటికి వచ్చి వెళ్తుంటాడు.. ఏం జరిగిందో సడన్‌గా..

Bangalore: Private Employee Commits Suicide In Lodge Hospet - Sakshi

హొసపేటె(బెంగళూరు): తాలూకాలోని ధర్మసాగర గ్రామానికి చెందిన రంగారెడ్డి(46) అనే ప్రైవేటు కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన బెంగళూరులోని వోల్వో కంపెనీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ధర్మసాగరలోనే ఉంటున్నారు. రంగారెడ్డి సెలవుల సమయంలో వచ్చి వెళ్తుంటాడు. ఈక్రమంలో బుధవారం హొసపేటెలోని కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌లో ఉన్న యాత్రి నివాస్‌లో గది అద్దెకు తీసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాత్రి నివాస్‌ సిబ్బంది గమనించి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు తానే కారణమని రంగారెడ్డి రాసినట్లుగా డెత్‌నోట్‌ లభించిందని  టౌన్‌ పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో..

బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి  
మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్‌ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని  ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది.  ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు.

చదవండి: నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top