దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని..

Bangalore 20 year Old Youth Beaten To Death For Chatting With Girl - Sakshi

బెంగళూరు: అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడ్ని దారుణం హత్య చేశారు నలుగురు వ్యక్తులు. కర్రతో కొట్టి అతడ్ని హతమార్చారు. కర్ణాటక బెంగళూరులో ఈ పాశవిక ఘటన వెలుగుచూసింది.

మృతుడి పేరు గోవిందరాజు. కొద్దిరోజులుగా ఓ అమ్మాయితో చాటింగ్  చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అనిల్ అనే వ్యక్తి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథకం పన్ని అతడ్ని ఇంట్లో నుంచి బయటకు పిలిపించాడు. బైక్‌పై అంద్రల్లి తీసుకెళ్లాడు. 

అనంతరం లోహిత్, భరత్, కిశోర్ కూడా అంద్రల్లి వెళ్లారు. నలుగురు కలిసి గోవిందరాజుపై విచక్షణా రహితంగా కర్రతలో దాడి చేశారు. అతడ్ని చావబాదారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గోవిందరాజు మృతదేహాన్ని లోహిత్ కారులో దాచారు. తర్వాత తీసుకెళ్లి ఛార్ముడిఘాట్ ప్రాంతంలో పడేశారు. సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు.

అయితే గోవిందరాజు కన్పించడం లేదని అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు నేరం అంగీకరించారు. వారు చెప్పిన వివరాలతో గోవిందరాజు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top