Woman Thrown in Crowd at Bageshwar Dham Dhirendra Shastri Event - Sakshi
Sakshi News home page

బహిరంగ సభలో అపశ్రుతి.. మహిళని ఎత్తిపడేసిన బౌన్సర్లు.. 

Jul 13 2023 6:23 PM | Updated on Jul 13 2023 7:03 PM

Bageshwar Dham Dhirendra Shastri Event Woman Thrown Crowd - Sakshi

గ్రేటర్ నోయిడా: బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నోయిడాలో నిర్వహించిన "దివ్య దర్బార్"కు భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బ్యారికేడ్లు దాటుకుని వచ్చిన మహిళను అక్కడి బౌన్సర్లు ఎత్తి అవతల పారేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అక్కడే ఉండి  చోద్యం చూస్తోన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ నోయిడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

ఉత్తరాదిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి విశేష ఆదరణ ఉంది. ఆయన ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే భక్తులు అశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. అలాగే నోయిడాలో నిర్వహించిన దివ్యదర్బార్  కార్యక్రమానికి కూడా సభాప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. సగం కార్యక్రమం పూర్తైనా అప్పటికింకా భక్తులు సభాస్థలికి వస్తుండడంతో వారిని ఇంటికి వెళ్లి లైవ్ లో కార్యక్రమాన్ని చూడవలసిందిగా వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా ధీరేంద్ర కృష్ణ ప్రవచనాలు చెబుతున్న సమయంలో ఒక మహిళ బ్యారికేడ్లు దాటుకుని స్టేజి వద్దకు దూసుకుని వెళ్లగా అక్కడ ఉన్న వాలంటీర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఎస్సై రామ శంకర్ వారిని వారించకుండా నిల్చుని చూస్తుండడం వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో సదరు ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నోయిడా పోలీసు శాఖ. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వాలంటీర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement