
బండితో రోడ్డెక్కితే చాలు కొంత మంది సినిమాల్లో హీరోల్లా ఫీలైపోతున్నారు. తమ చేతిలోని వాహనాలతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాము ఉన్నది రహదారులపై అని మరిచిపోయి మితిమీరిన విన్యాసాలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. థ్రిల్ కోసమే, ఫేమ్ కోసమే ఇలాంటి ఫీట్లు చేస్తూ ఒక్కోసారి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి తాజాగా గ్రేటర్ నోయిడాలో (Greater Noida) బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి.. ఓవరాక్షన్ చేసిన వ్యక్తి తిక్క కుదిర్చారు.
వీడియోలో ఏముందంటే..
మెయిన్ రోడ్డులో వేగంగా దూసుకుపోతున్న కారు.. కొంచెం దూరం వెళ్లాక సడన్‌గా రివర్స్ తిరుగుతుంది. మరొక కారులోని వీడియో ద్వారా దృశ్యాన్ని రికార్డు చేశారు. అదే కారు మళ్ళీ అదే స్టంట్ చేసి.. ఓ రెసిడెన్షియల్ సొసైటీ పార్కింగ్‌లోకి వేగంగా దూసుకెళ్లి ఆగుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో గ్రేటర్ నోయిడా ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కారుతో ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి 57,500 రూపాయల జరిమానా విధించారు. నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనం నడిపినందుకు ఈ జరిమానా వేశారు.
"గ్రేటర్ నోయిడా రోడ్లపై ఓ వ్యక్తి కారుతో విన్యాసాలు చేశాడు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు చర్య తీసుకుని రూ. 57,500 జరిమానా విధించారు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు మంచి పని చేశారని" పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించినందుకు సంబంధిత వాహనంపై నిబంధనల ప్రకారం ఈ-చలాన్ (రూ. 57,500/- జరిమానా) జారీ చేయడం జరిగిందన్నారు.
సోషల్ మీడియా స్పందన
ఈ వ్యహారంపై సోషల్ మీడియాలో నెటిజనులు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. "ఖరీదైన స్టంట్'' అని ఒక నెటిజన్ (Netizen) కామెంట్ చేశారు. జరిమానా విధించకుండా.. కారును స్వాధీనం చేసుకోవాల్సింది. ప్రమాదకర విన్యాసాలు చేసిన వ్యక్తికి కర్రలతో బడితపూజ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అప్పుడే ఇలాంటి వారు గుణపాఠం నేర్చుకుంటారని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
చదవండి: 'బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు'
''ఇలాంటి వారికి ప్రతిరోజూ ఇది మామూలే. ఆల్ఫా 2 మార్కెట్ చుట్టూ నేను ప్రతిరోజూ ఇలాంటి డ్రైవర్లను చూస్తుంటాను. గ్రేటర్ నోయిడాలో ట్రాఫిక్ నియమాలను ఎలా జోక్‌గా చూస్తారో చూసి నేను ఆశ్చర్యపోతుంటాను. యూపీ అంతటా ఇలాంటి సమస్య ఉందని అనుకుంటున్నాను. నేను బెంగళూరులో (Bengaluru) ఉన్నప్పుడు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్‌ను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రధానంగా పౌర సమస్య అయినప్పటికీ, మరి పోలీసింగ్ మాట ఏమిటి?'' అంటూ మరో నెటిజన్ వాపోయారు.
A guy performed stunts with his car on
the streets of Greater Noida. 🚗💨
Noida Traffic Police took action and imposed a fine of ₹57,500.
Good Job, @Noidatraffic 👏👏 pic.twitter.com/Qn1nmGpmJj— Greater Noida West (@GreaterNoidaW) October 10, 2025