న్యాయవాదుల హత్య: పుట్ట శైలజపై కేసు నమోదు

Advocates Murder: Manthani Police Registered Case Against Putta Madhu Wife Shailaja - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్‌లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్‌ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ.. తన ఫోన్‌ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచి్చన రామగుం డం ఆర్‌ఎస్సై అజ్మీరా ప్రవీణ్‌ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు, కోర్టు పీసీ ఫోన్‌లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్‌ వెళ్లే దారిలో మరోసారి వచి్చన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్‌ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు. పోలీస్‌ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మేజిస్ట్రేట్‌‌ అనుమతితో మంథని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్‌ ఇచ్చి మాట్లాడించారని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సైతం పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.  
(చదవండి: రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం)  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top