టీవీ చూడనివ్వడం లేదని బాలుడి ఆత్మహత్య

సాక్షి, ముంబై: టీవీ చూడనివ్వడం లేదనే కోపంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పింప్రి–చించ్‌వడ్‌లోని చిఖలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, రంజాన్ అబ్దుల్ శస్త్రక్ (13) తరుచూ ఎక్కువగా టీవీ చూస్తుండటంతో వాళ్ల అమ్మ తిడుతూ ఉండేది. దీంతో మనస్థాపానికి గురైన అబ్దుల్ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రంజాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో రంజాన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి