దారుణం: సమాధులతో నిండిన పాఠశాల..మాతృ భాష శాపమైందా?

751 Children Bodies Found At Indigenous School In Canada - Sakshi

రెజీనా: కెనడాలోని 1899 నుంచి 1997 వరకు నడిచిన మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో 751 మంది గుర్తు తెలియని పిల్లల సమాధులు కనుగొన్నారు. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని  పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలను గుర్తించారు. ఇక ప్రస్తుత ఘటన జరిగిన ప్రాంతం సస్కట్చేవాన్ రాజధాని రెజీనాకు తూర్పున 87 మైళ్ళ దూరంలో ఉంది. 

ఈ ఘటనపై కౌసెస్ చీఫ్ కాడ్ముస్న్ డెల్మోర్ మాట్లాడుతూ.. ‘‘పాఠశాలను నిర్వహిస్తున్న రోమన్ కాథలిక్ చర్చి అక్కడ ఆనవాళ్లు తెలియకుండా గుర్తులను తొలగించింది. దీన్ని నేరంగా భావిస్తున్నాం. ఇది ఓ విధంగా దేశంపై దాడి చేయడం వంటిది. ఇక్కడ ఇంకా ఎన్ని మృతదేహాలను పూడ్చి పెట్టారో.. వాటన్నింటిని తెలుసుకునే వరకు అన్వేషణ కొనసాగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని’ పేర్కొన్నారు.

ఇలా వెలుగులోకి..
గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని ఓ పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి ఏం జరిగిందో.. తెలుసుకోవాల్సిందిగా మత, రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కెనడా ప్రభుత్వం పాఠశాలలో శారీరక, లైంగిక వేధింపులు అధికంగా ఉన్నట్లు, అంతేకాకుండా విద్యార్థులు తమ  మాతృభాష మాట్లాడితే వారిపై దాడి చేయడం వంటివి క్రూరమైన చర్యలు కూడా జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

చదవండి: వైరల్‌:అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top