సెల్‌ ఫోన్‌ స్క్రీన్‌ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని చెప్పి.. | 50Thousand Stolen By Unknown Persons With Fake Bank Call | Sakshi
Sakshi News home page

సెల్‌ ఫోన్‌ స్క్రీన్‌ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని చెప్పి..

Dec 19 2021 12:05 PM | Updated on Dec 19 2021 5:00 PM

50Thousand Stolen By Unknown Persons With Fake Bank Call - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

క్రెడిట్‌ కార్డు పరిమితి పెంచుతామని నమ్మించి 50 వేలు కాజేశారు..

హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డు పరిమితిని పెంచుతామంటూనమ్మించి అతని ఖాతాలో నుంచి రూ.50 వేలను కాజేసిన ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరా ల ప్రకారం.. ప్రైవేటు సంస్థలో పనిచేసే మారంరెడ్డి నర్సింహ వెంగళరావునగర్‌ కాలనీలోని ధన్‌రాజ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసముంటన్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బ్యాంకు ప్రతినిధుల్లా మాట్లాడారు. మీరు వాడుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డు లిమిట్‌ రూ.55 వేల నుంచి లక్షా 25 వేలకు పెంచుతామని నమ్మబలికారు. 

ఇందుకు సెల్‌ ఫోన్‌ స్క్రీన్‌ షేరింగ్‌కు అనుమతి ఇవ్వాలని తెలుపడంతో నర్సింహ స్క్రీన్‌ను షేరింగ్‌ చేశాడు. అనంతరం ఒక ఓటీపీ నెంబర్‌ను పంపి నమోదు చేయాలని చెప్పారు. ఓటీపీ నమోదు చేయగానే రూ.50 వేలు ఖాతాలో గల్లంతయ్యాయి. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసును శనివారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement