Hyderabad: పుప్పాలగూడలో విషాదం, గోడకూలి ముగ్గురు మృతి | 3 Dead Cellar Digging After Wall Collapse Accident Puppalaguda Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: పుప్పాలగూడలో విషాదం, గోడకూలి ముగ్గురు మృతి

Jun 25 2022 4:42 PM | Updated on Jun 25 2022 5:47 PM

3 Dead Cellar Digging After Wall Collapse Accident Puppalaguda Hyderabad - Sakshi

ప్రమాద స్థలం

నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ ఆవరణలో సెల్లార్‌ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ ఆవరణలో సెల్లార్‌ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement