breaking news
Cellar
-
సెల్లార్లలో 'సిరులు'!
11,820 చదరపు మీటర్ల మట్టి, బండరాళ్ల అమ్మకం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 121/పీలో నమిశ్రీ ప్రాజెక్ట్స్ నిర్మాణ పనులపై గనుల శాఖ 2024 నవంబర్‌లో నోటీసు జారీ చేసింది. అధికారుల తనిఖీలో సెల్లార్ తవ్వకం దాదాపు పూర్తయినట్లు, సుమారు 11,820 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మట్టి, బండరాళ్లను తవ్వి అక్రమంగా అమ్మేసుకున్నట్లు బయటపడింది. దీంతో సాధారణ సీనరేజ్ ఫీజు, పది రెట్ల జరిమానా, డీఎంఎఫ్, ఎస్ఎంఈటీ, ఇతర రుసుములతో కలిపి రూ.3.39 కోట్లు చెల్లించాలని గనుల శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. కానీ ఆ సంస్థ జరిమానా చెల్లించలేదు. దీంతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామని మైనింగ్ శాఖ ప్రకటించినా అందులో పురోగతి లేదు.కల్వల మల్లికార్జున్‌రెడ్డి హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాల కోసం తవ్వుతున్న సెల్లార్ గుంతల నుంచి మైనింగ్ మాఫియా ‘రూ.కోట్లు’ వెలికితీస్తోంది. సెల్లార్ తవ్వకంలో వెలువడే మైనర్ మినరల్స్‌ను (మట్టి, బండరాళ్లు తదితరాలు) అక్రమంగా తరలిస్తూ భారీయెత్తున సొమ్ము చేసుకుంటోంది. మైనర్ మినరల్స్‌కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమాలు కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రాయల్టీ, సీనరేజీ, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ (పర్యావరణ ప్రభావం) ఫీజు తదితరాలను ఎగవేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. గనుల శాఖ షోకాజ్ నోటీసులను కూడా మైనింగ్ మాఫియా బేఖాతరు చేస్తుండగా, కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే సెల్లార్ తవ్వకాలు సాగిస్తోంది. కొన్నిచోట్ల సెల్లార్ నిర్మాణాల పేరిట అక్రమ మైనింగ్, రవాణా విచ్చలవిడిగా సాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణలున్నాయి. చాలాచోట్ల బిల్డర్లు భవన నిర్మాణ అనుమతి మాత్రమే తీసుకుని, మైనింగ్ అనుమతులు లేకుండా భారీగా తవ్వి టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి ఉన్నా పరిమాణానికి మించి తవ్వి, ఓవర్‌లోడ్‌తో రవాణా చేస్తున్నారు. ఉల్లంఘన జరిగితే సాధారణ సీనరేజ్‌కు పది రెట్లు పెనాల్టీ విధించాలని నిబంధనలున్నా అరుదుగా మాత్రమే ఇది అమలవుతోంది. రాజకీయ అండ, గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం, అక్రమార్కులతో కొందరు అధికారులు చేతులు కలపడంతో మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఖనిజ నిర్వహణ, రవాణాను పర్యవేక్షించాల్సిన మైనింగ్ విభాగం.. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ చేతులెత్తేస్తోంది. పర్యవేక్షణ లేదు..తనిఖీల్లేవు భవన నిర్మాణ ప్రదేశాలను గనుల శాఖ అధికారులు తనిఖీ చేసి సెల్లార్ లేదా బేస్మెంట్ కోసం తవ్విన పరిమాణాన్ని లెక్కించాలి, ఒకవేళ నిర్మాణ ప్రదేశం నుంచి బయటకు తరలిస్తే ఆ పరిమాణాన్ని లెక్కించి సీనరేజీ ఫీజు వసూలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే సీనరేజీ ఫీజుతో పాటు జరిమానా విధిచవచ్చు. చట్టబద్ద అనుమతి లేకుండా తవ్విన, రవాణా చేసిన ఖనిజాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ..ఆమోదిత భవన ప్రణాళికలో సెల్లార్ ఉందా, ఒకవేళ ఉంటే ఎంత విస్తీర్ణం, ఎంత లోతు వరకు అనుమతులు ఉన్నాయి, నిర్మాణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయా? అని పర్యవేక్షించే యంత్రాంగం లేకుండా పోయింది. దీంతో సెల్లార్ తవ్వకాల్లో బయట పడే మట్టి, రఫ్‌స్టోన్, బిల్డింగ్ స్టోన్ వంటి మైనర్ మినరల్స్ పరిణామానికి లెక్కే లేకుండా పోతోంది. వెలికి తీసిన మట్టి, రఫ్‌స్టోన్, బిల్డింగ్ స్టోన్‌ను అదే ప్రాంగణంలో ఉపయోగించారా లేక అక్రమంగా బయటకు తరలించారా అని తనిఖీలు చేసే వారే కరువయ్యారు. నిర్మాణ ప్రదేశం నుంచి తరలించే ఖనిజానికి చట్టబద్ద అనుమతులు ఉన్నాయా, సీనరేజీ ఫీజు చెల్లించారా, రవాణా అనుమతులు ఉన్నాయా అని పర్యవేక్షించే యంత్రాంగం కనిపించడం లేదు. సమన్వయ లోపమూ వరమే.. గనులు, రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య సమన్వయం, సమాచార మారి్పడి లేకపోవడం మైనింగ్ మాఫియాకు వరంగా మారింది. భవన నిర్మాణాలు, సెల్లార్ తవ్వకాల అనుమతులను గనుల శాఖతో సంధానించేలా సమగ్ర ఆన్లైన్ విధానం రూపొందించి జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని 2024లోనే నిర్ణయించినా నేటికీ ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. మరికొన్ని అక్రమాలు.. ⇒ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలో రైచందానీ కన్స్ట్రక్షన్ కంపెనీ 1600 చదరపు మీట్ల విస్తీర్ణంలో సెల్లార్ గుంతను తవ్వింది. అనుమతులు, పర్యావరణ ప్రభావ రుసుము చెల్లించినా తవ్వి తీసిన 7,200 మెట్రిక్ టన్నుల మట్టికి సంబంధించిన ఆధారాలు సమర్పించలేదు. ⇒ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మన్సూరాబాద్ ప్రాంతంలోని ఆటోనగర్ పార్కింగ్ ఏరియా, ఇంద్రానగర్ కాలనీ, విజయశ్రీ కాలనీ తదితర చోట్ల నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్లార్ తవ్వకాలపై ఫిర్యాదులు అందడంతో గనుల శాఖ మట్టి అక్రమ రవాణాపై నోటీసులు జారీ చేసింది. తవ్వకాలు, రవాణా అడ్డుకోవాలని పోలీసులు, స్థానిక తహశీల్దార్లకు లేఖలు రాసి చేతులు దులుపుకుంది. ⇒ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌లో రుబ్రిక్ ఎస్టేట్స్‌కు గ్రావెల్ తవ్వకం, రవాణాకు సంబంధించి గనుల శాఖ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. 2025 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు 10 వేల మెట్రిక్ టన్నుల తవ్వుకోవచ్చని పేర్కొంది. అదే ఏడాది అక్టోబర్ 23న తనిఖీ చేసిన అధికారులు నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. దీంతో తవ్వకాలు, రవాణా నిలిపివేయాలని తహసీల్దార్, పోలీసులకు సూచించారు. కానీ చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ⇒ నగరం నడిరోడ్డున ఉన్న బేగంపేట కుందన్‌బాగ్ పార్కు రోడ్డులోని విశాలమైన ప్రదేశంలో భారీ సెల్లార్ గుంత కాసుల వర్షం కురిపిస్తోంది. రాత్రి వేళలో భారీ ఎక్సకవేటర్లతో తవ్వకాలు సాగిస్తున్నారు. అక్రమ మైనింగ్ వ్యాపారులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని దందా సాగుతోంది. ఎక్స్కవేటర్ ద్వారా మట్టి నింపేందుకు చాప మొరంకు రూ.200, స్టాక్ మొరంకు రూ.500, సెల్లార్ కటింగ్ మొరంకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల మట్టి అక్రమంగా సెల్లార్ ప్రదేశం నుంచి తరలివెళ్లినట్లు అంచనా. ⇒ ఓల్డ్ నల్లకుంట పరిధిలోని ఆజమాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాలోని ఓ భారీ సెల్లార్ గుంత కూడా మైనింగ్ మాఫియాకు వరంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా సెల్లార్ గుంత నుంచి మట్టి అక్రమంగా బయటకు తరలివెళ్తోంది. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ విభాగాల అండతోనే ఈ దందా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.సెల్లార్ల నుంచి క్రషర్లకు.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగర శివారులో వేగంగా అభివృద్ది చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కేంద్రంగా ‘సెల్లార్ల మైనింగ్ మాఫియా’పనిచేస్తోంది. హైరైజ్ బిల్డింగ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, గోదాములు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ మైనింగ్ మాఫియా విజృంభిస్తోంది. సెల్లార్ తవ్వకాల్లో వెలికితీస్తున్న రఫ్‌స్టోన్, బిల్డింగ్ స్టోన్ హైదరాబాద్ శివార్లలో ఉన్న శంషాబాద్, గండిపేట, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ, కోకాపేట్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, కొల్లూరు, ఉస్మాన్‌నగర్, మియాపూర్, నార్సింగి తదితర చోట్ల అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్లకు అక్రమంగా తరలివెళ్తోంది. కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక సంస్థలు, గనుల శాఖ అనుమతులు లేకుండా ఏర్పాటైన ఈ క్రషర్లు సైతం ప్రభుత్వానికి ఎలాంటి సీనరేజీ ఫీజు, జీఎస్టీ వంటివి చెల్లించకుండా ఖజానాకు గండి కొడుతున్నాయి. ఈ క్రషర్ల ద్వారా క్రషర్ మెటల్ హైదరాబాద్‌లోని నిర్మాణ ప్రాజెక్టులకు సరఫరా అవుతోంది. నిబంధనలు ఏమిటి? ఎంత ఫీజు? భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలోనే నిర్మాణదారులు తమ సెల్లార్ లేదా బేస్మెంట్కు సంబంధించిన ప్రణాళికలను సమర్పించాల్సి ఉంటుంది. సెల్లార్ స్తాయి, విస్తీర్ణం, పార్కింగ్ వినియోగం వంటి వివరాలన్నీ ఈ అనుమతి పత్రాల్లో ఉంటాయి. నిబంధనల ప్రకారం అనుమతి వచ్చిన తర్వాతే సెల్లార్ తవ్వకాలు నిర్ణీత పరిమితికి లోబడి జరపాలి. 2025 జూలై 23న జారీ చేసిన జీఓ నంబర్ 17 ప్రకారం ప్రతి చదరపు అడుగుకు రూ.8 చొప్పున పర్మిట్ ఫీజు చెల్లించాలి. ఒకవేళ సెల్లార్ విస్తీర్ణం 10వేల చదరపు అడుగులకు మించితే పర్యావరణ ప్రభావ రుసుము (ఈఐఎఫ్) కూడా చెల్లించాలి. తెలంగాణ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం సెల్లార్ తవ్వకంలో వెలికితీసే సాధారణ మట్టి (ఆర్డినరీ ఎర్త్), మొర్రం, గ్రావెల్‌పై సీనరేజ్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం మొర్రం/గ్రావెల్, సాధారణ మట్టికి మెట్రిక్ టన్నుకు రూ.20 నుంచి రూ.26 వరకు సీనరేజ్ ఫీజు ఉంది. దీనికి అదనంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) ఫీజు సీనరేజ్‌లో 30 శాతం, స్టేట్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎస్ఎంఈటీ) ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
సెల్లార్ల తవ్వకాలు.. తెల్లారుతున్న బతుకులు
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణాల్లో బిల్డర్ల ఉల్లంఘనలు, అధికారుల ఆమ్యామ్యాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. నిర్మాణాల్లో పలు డీవియేషన్లకు పాల్పడే బిల్డర్లు సెల్లార్ల తవ్వకాల్లోనూ కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో.. పొట్టకూటి కోసం పనిచేసే కార్మికులు అసువులు బాస్తున్నారు. తాజాగా బుధవారం ఎల్బీనగర్ పరిధిలో ముగ్గురి ప్రాణాలు పోవడం వెనుకా నిలువెత్తు నిర్లక్ష్యమే బట్టబయలైంది. సంబంధిత అధికారులు సైతం మొక్కుబడిగా నోటీసులిస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప పనులు ప్రారంభమైనప్పటి నుంచీ తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం లేదు. బిల్డర్లు, అధికారులకు మధ్యనున్న ‘ఆర్థిక సంబంధాలే’ ఇందుకు కారణమనే ఆరోపణలు షరా‘మామూలు’గా మారాయి. నిబంధనలు కాగితాల్లోనే.. ⇒ అనుమతులతోపాటు పాటించాల్సిన నిబంధనలు కాగితాల్లో ఉంటున్నాయి తప్ప చాలామంది వాటిని పాటించడం లేదు. నిబంధనల మేరకు సెల్లార్ తవ్వే నేల బలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. పనులు జరిగే ప్రాంతంలో బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఉండాలి. ప్రస్తుతం పనులు తొలి దశలోనే ఉన్నందున రిటైనింగ్ వాల్ దాకా రాలేదు కానీ మిగతా జాగ్రత్తలు కూడా పాటించలేదు. ⇒ నేల జారిపోకుండా అవసరమైన పటిష్టతా చర్యలు చేపట్టాల్సి ఉండగా అవీ జరగడంలేదు. తగిన సెట్బ్యాక్లు లేవు. సెల్లార్ తవ్వకం ప్రాంతాన్ని నిత్యం పరిశీలిస్తూ, ఎక్కడైనా నేల బలహీనంగా ఉన్నా, జారిపోయేలా ఉన్నా వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. కానీ వాటిని పట్టించుకోలేదు. నిర్మాణంలో భద్రతా చర్యలు, కారి్మకుల రక్షణ చర్యలు గాలికొదిలేశారు. ⇒ జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు సెల్లార్ తవ్వకానికి ముందు నిర్మాణదారు సంబంధిత అధికారికి సమాచారమివ్వాల్సి ఉండగా, ఆ పని చేయలేదు. సంబంధిత సర్కిల్ అధికారి గతనెల 16వ తేదీన ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి నోటీసు ఇచి్చనట్లు ఎల్బీనగర్ జోన్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సెల్లార్ తవ్వకం పనులు మొదలు పెట్టారు. అందువల్లే వదులుగా ఉన్న మట్టి మీదపడి ముగ్గురి ప్రాణాలు పోవడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృత్యు ఘంటికలు ఇలా.. చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే సెల్లార్లు తవ్వుతున్నారు. గత సంవత్సరం అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. ఎల్బీనగర్జోన్లో ఇవి ఎక్కువగా ఉండటం కూడా వెల్లడైంది. తవ్వకాల్లో వెలువడిన మట్టిని తరలించే లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తుండటాన్ని గుర్తించారు. ⇒ సెల్లార్ తవ్వకాల్లో ఉల్లంఘనల వల్లే దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నానక్‌రామ్‌గూడలో భవనం కూలి పదిమందికి పైగా మరణించారు. ⇒ 2017లో కొండాపూర్‌లో ఓభవన నిర్మాణానికి సంబంధించి 30 అడుగుల లోతున జరుగుతున్న సెల్లార్ పనుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ⇒ 2019లో ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న సెల్లార్లో పడి ఇద్దరు మైనర్ బాలలు మరణించారు. ⇒ 2020లో మాదాపూర్ ఖానామెట్‌లో ప్రై వేట్ కళాశాల బస్సు సెల్లార్ గుంతలో పడింది.కూకట్‌పల్లిలో ఏడాదిక్రితం నిబంధనలు పాటించనందున సెల్లార్ తవ్వుతున్న పరిసరాల్లో నేల కుంగింది. -
సెల్లార్ తవ్వుతుండగా కూలిన అపార్ట్మెంట్ ప్రహరీ
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భరత్పురి కాలనీ సెవెన్‌హిల్స్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ పక్కన ఆదివారం ఉదయం సెల్లార్ తవ్వుతుండగా ప్రహరీ కూలిపోయిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్మెంట్ పక్కనే సెల్లార్ కోవసం తవ్వుతున్నారని మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మున్సిపల్ అనుమతి లేకుండానే సెల్లార్లు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే సెల్లార్ తవ్వకం పనులను నిలిపివేయించాలని అధికారులను అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. -
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలింది
గచ్చిబౌలి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నాణు, హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్నగర్లో ఉంటున్నారు. నాణు ఆటో డ్రైవర్‌గా, హీరాబాయి హౌస్‌మేడ్‌గా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమావతి రాణి(17) యూసూఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్టీఆర్నగర్లోని సిరీస్ సంస్థకు సంబంధించిన సెల్లార్ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరామర్శించారు. పరిహారం చెల్లించాలని ఆందోళన 14 ఏళ్ల క్రితం సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహంతో సెల్లార్ గుంత వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇటు బాధితులు అటు సైట్ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగివచి్చన యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ గుచ్చి) -
Hyderabad: పుప్పాలగూడలో విషాదం, గోడకూలి ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ఆవరణలో సెల్లార్ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. -
కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న నీటిలోకి దిగే క్రమంలో ఒకరు జారిపడిపోతోంటే.. ఆమెను కాపాడేందుకు ఒకరి తరువాత ఒకరు మొత్తం ఐదుగురు బాలికలు అందులో పడిపోయారు. ముగ్గురు చనిపోగా ఇద్దరు బయటపడ్డారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 4వ ఫేజ్‌లో ఆర్టీఐ కార్యాలయం ఆనుకొని ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలంలో 8 ఏళ్ల క్రితం బహుళ అంతస్థుల నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వారు. అప్పటి నుంచి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో గుంతలోకి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. బతుకుదెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ టీ కొట్టు నిర్వహిస్తూ తన ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుతో ఆర్టీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. అతని నాలుగో కుమార్తె సంగీత కుమారి (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. యూపీకి చెందిన ప్రమోద్ గుప్త, గీత దంపతులు కూడా ఆర్టీఐ కార్యాలయం సమీపంలోనే టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరి కూతురు రమ్య (7) అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన పర్విన్ కుమార్తె సోఫియా (10) నాలుగో తరగతి చదువుకుంటోంది. వీరితోపాటు చదువుతున్న నేహా, సంగీత చెల్లెలు నబియా ఐదుగురు కలిసి మధ్యాహ్నం ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. తొలుత సంగీత నీటిలో దిగేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకు రమ్య నీటిలోకి దిగి ఆమె సైతం మునిగింది. వీరిని కాపాడేందుకు సోఫియా యత్నించగా ఆమె కూడా మునిగిపోయింది. నేహా, నబియా వీరిని కాపాడేందుకు యత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వీరు తర్వాత ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికి తీశారు. నిర్లక్ష్యమే పెను శాపం.. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ 4వ ఫేజులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను అప్పగించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల లోతు సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారు. దీంతో గుంత నీటితో నిండి నిరుపయోగంగా ఉంది. ఎనిమిదేళ్లుగా ఇలాగే ఉండటంతో పిల్లల ప్రాణాల పాలిట యమపాశంగా మారింది. గతంలో ఇద్దరు బాలురు ఇందులో పడి మృతిచెందారు. -
పేక మేడ
సోమవారం సాయంత్రం... షేక్‌పేట సత్య కాలనీ సమీపంలోని బస్తీ...ఉన్నట్టుండి పెద్ద శబ్దం. అందరిలోనూ కలవరం. ఎక్కడ ఏం జరిగిందోనని ఆరాటం... తరచి చూస్తే...పేకమేడలా కూలిన నాలుగంతస్తుల భవనం. నిర్మాణంలోని భవనం కావడంతో పెను ముప్పు తప్పింది. సెల్లార్‌లోని కారు మాత్రం నుజ్జునుజ్జయింది. సమీపంలోని కార్మికులకు గాయాలయ్యాయి. గోల్కొండ: నిర్మాణం పూర్తికావచ్చిన ఓ నాలుగు అంతస్తుల భవనం పేక మేడలా ఓ పక్కకు ఒరిగి పోయింది. ఎడా పెడా లోతైన సెల్లార్లు తవ్వడడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం షేక్‌పేట్‌లోని సత్యకాలనీ సమీపంలోని బస్తీలో నిర్మాణం పూర్తికావచ్చిన ఓ భవనం సెల్లార్‌లోని పిల్లర్లు కుప్పకూలడంతో సమీపంలోని మరో భవనం వైపు ఒరిగింది. వివరాల్లోకి వెళితే షేక్‌పేట్ హరిజన్బస్తీకి చెందిన సీహెచ్ పద్మావతికి బీజేఆర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో 400 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో 200 గజాల్లో నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అదే భవనానికి ఆనుకొనే ఫారూఖ్ అనే వ్యక్తి మరో జీ+4 భవన నిర్మాణం చేపట్టాడు. ఇందులో భాగంగా అతను తన భవనానికి లోతైన సెల్లార్ తవ్వాడు. కాగా ఈ రెండు భవనాల వెనుక మరో వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ తవ్వాడు. ఇదిలా ఉండగా సోమవారం పద్మావతి భవనంలోని పిల్లర్లు కుప్ప కూలడంతో భవనం పెద్ద శబ్దంతో పారూఖ్ భవనం మీదకు ఒరిగి పోయింది. అయితే ప్రమద సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా కాంక్రిట్ ముక్కలు పడి సమీపంలోని గుడిసెల్లో నివాసం ఉంటున్న సునీత, బరువుల సూర్యలకు గాయాలయ్యాయి. పద్మావతి భవనం సెల్లార్లో పార్కుచేసిన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదంపై సమాచారం అందడంతో ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, మాగంటి గోపీనాథ్, ఎంఎల్సీ రాములు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. భవనం అనుమతులపై విచారణ చేపడతామని షేక్‌పేట్ తహశీల్దార్ చంద్రకళ పేర్కొన్నారు. కాగా టౌన్‌ప్లానింగ్ అధికారులెవరూ సంఘటన స్థలానికి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్ప కూలినప్పుడే.. సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదాలు జరిగినప్పుడో.. ప్రాణాలు పోయినప్పుడో మాత్రమే నగరంలో భవన నిర్మాణ అనుమతులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాసులకు అలవాటుపడ్డ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నగరంలో అడ్డదిడ్డంగా వెలుస్తున్న భవనాలను పట్టించుకోవడం లేరు. తాజాగా షేక్‌పేట హరిజనబస్తీలోని జీప్లస్ మూడంతస్తుల భవనం ఒరిగిపోవడం అధికారుల వైఖరికి అద్దంపడుతోంది. ఎనిమిదేళ్లుగా ఎలాంటి అనుమతుల్లేకుండా ఈ భవన నిర్మాణం కొనసాగుతున్నా అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సెల్లార్‌లోని కారు నుజ్జునుజ్జయింది. ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే చర్చకు వస్తున్న నిర్మాణ అనుమతులు, భూసార పరీక్షలు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ తదితర అంశాలను ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ భవనానినికి సంబందించి ఎలాంటి అనుమతులు లేకున్నా, కొద్ది స్థలంలోనే పలు అంతస్తులు నిర్మిస్తున్నా.. తగినంత సెట్బ్యాక్లు వదలకుండా భారీ డీవియేషన్లకు పాల్పడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తమ చేతులు తడిపితే చాలుననుకున్నవారు ఇరుకు జాగాలోనే భహుళ అంతస్థులు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. సెల్లార్లపై నిర్లక్ష్యం.. భూసార పరీక్షల కనుగుణంగా సెల్లార్ తవ్వకాల్లో ప్రమాణాలు పాటించాల్సి ఉన్నా..ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైనా మధ్యలో కొంతకాలం నిర్మాణ పనులు ఆపివేసినట్లు తెలిసింది. దీంతో ఐరన్ తుప్పుపట్టడం .. ఇతర కారణాల వల్ల కూడా ఒరిగిపోయి ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. సెల్లార్ చుట్టూ 10 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదలాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు. గతంలో సోమాజిగూడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి సెల్లార్ తవ్వకంలో, మినిస్టర్ రోడ్‌లోని మరో ఆస్పత్రి నిర్మాణ సమయంలోనూ ఇలాంటి ఘటన లు జరిగయి. ఆర్కే పురంలో రెండేళ్ల క్రితం సెల్లార్ తవ్వకాల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సెల్లార్ల తవ్వకాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. -
సెల్లార్ల కూల్చివేతకు సై
తొలగింపు ప్రక్రియకు శ్రీకారం పేరున్న భవనాలకూ అదే శాస్తి వాణిజ్య ప్రాంతంపై జీవీఎంసీ దృష్టి అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు విశాఖపట్నం సిటీ : నిబంధనలు విరుద్ధంగా సెల్లార్‌ను ఆక్రమించిన వ్యాపారుల్లో జీవీఎంసీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. రూ.లక్షల్లో లీజుకిచ్చేసిన భవన యజమానులు, ఆక్రమణదారులను పరుగులెట్టిస్తున్నారు. బాబ్బాబు మా భవనం వద్దకు రావద్దని వేడుకుంటున్నా పట్టణ ప్రణాళిక అధికారులు గట్టిగా అడుగులేస్తున్నారు. స్మార్ట్‌సిటీ సాకారమయ్యేందుకు అధికారులంతా తమకు సహకరించాలంటూ కోరిన జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలను వంటపట్టించుకున్న ప్రణాళిక అధికారులు ఒత్తిళ్లను సైతం లెక్క చేయటం లేదు. కూలగొట్టే పని చేసుకుపోతున్నారు. ఏళ్ల తరబడి సెల్లార్లను ఆక్రమించి నిర్వహిస్తున్న ఆస్పత్రులు, మందులు దుకాణాలు, ఇతర గొడౌన్లను సైతం ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయకుండా రాజకీయ నేతలతో ఒత్తిడి తమ వర్గీయుడికే ఎమ్మెల్సీ పదవి దక్కేలా చేయడానికి ఇరువురు మంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చెరో జాబితా సిద్దం చేస్తున్నారు. మరోవైపు తటస్థ ముద్రతో ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోవాలని మరికొందరు నేతలు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశల పల్లకీలో : జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ పీఠంపై కన్నేసిన ఆశావాహుల జాబితా చాంతాడును తలపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టిక్కెట్లు దక్కని నేతలు అందరూ ఎమ్మెల్సీ స్థానానికి గురిపెట్టారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ. రహమాన్, మాజీ మంత్రి మణికుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, తోట నగేష్, నల్లూరి భాస్కరరావు, కోన తాతారావు తదితరులు రేసులో ఉన్నట్లు బయటపడ్డారు. వీరిలో కొందరు గంటా మద్దతు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరు అయ్యన్న ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు ఈ గ్రూపులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం చంద్రబాబు కటాక్షం కోసం పావులు కదుపుతున్నారు.


