సెల్లార్‌ తవ్వుతుండగా కూలిన అపార్ట్‌మెంట్‌ ప్రహరీ | Bharatpuri Colony Collapsed apartment wall | Sakshi
Sakshi News home page

సెల్లార్‌ తవ్వుతుండగా కూలిన అపార్ట్‌మెంట్‌ ప్రహరీ

Published Mon, Nov 25 2024 7:55 AM | Last Updated on Mon, Nov 25 2024 7:55 AM

Bharatpuri Colony Collapsed apartment wall

మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి భరత్‌పురి కాలనీ సెవెన్‌హిల్స్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ పక్కన ఆదివారం ఉదయం సెల్లార్‌ తవ్వుతుండగా ప్రహరీ కూలిపోయిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్‌మెంట్‌ పక్కనే సెల్లార్‌ కోవసం తవ్వుతున్నారని మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. 

మున్సిపల్‌ అనుమతి లేకుండానే సెల్లార్‌లు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే సెల్లార్‌ తవ్వకం పనులను నిలిపివేయించాలని అధికారులను అపార్ట్‌మెంట్‌ వాసులు డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement