టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య | 21 Year Old Man Allegedly Attacked And Killed By 3 Minors | Sakshi
Sakshi News home page

టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య

Oct 24 2022 9:26 PM | Updated on Oct 24 2022 9:26 PM

21 Year Old Man Allegedly Attacked And Killed By 3 Minors - Sakshi

ముంబై: ఒక వ్యక్తి టపాసుల కాల్చొద్దని చెప్పినందుకు ముగ్గురు మైనర్ల చేతిలో హతమయ్యాడు. ఈఘటన శివాజి నగర్‌లోని గోవాండిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ముగ్గురు మైనర్లు బహిరంగంగా సీసాలో టపాసులు పెట్టి కాలుస్తున్నారు. దీంతో 21 ఏళ్ల వ్యక్తి వారిని అలా టపాసులు కాల్చొద్దు అని వారించాడు. ఆ తర్వాత ఇరువైపులా మాటా మాటా పెరిగి వాగ్వాదం తలెత్తింది.

అంతే కోపంతో ఒక మైనర్‌ సదరు వ్యక్తిని దారుణంగా కొట్టి చాకుతో మెడపై పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు వ్యక్తీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: ఎందుకలా చూస్తున్నారు అని ప్రశ్నించాడని...కొట్టి చంపేశారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement