వాలీబాల్‌ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి 

15 Year Old Boy Collapses While Playing Volleyball In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాలీబాల్‌ ఆడుతున్న ఓ బాలుడు గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ సంఘటన మెఘల్‌పుర పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ ముఖేశ్‌ తెలిపిన మేరకు.. ఆలిజాకోట్లా ప్రాంతానికి చెందిన నవాజ్‌ అహ్మద్‌ (14) నవాజ్‌ అహ్మద్‌ ఆలిజాకోట్లా అంధేరీ గల్లీలో ఉండే గ్రౌండ్‌కు వెళ్లి తోటి స్నేహితులతో వాలీబాల్‌ ఆడాడు. వాలీబాల్‌ ఆడుతుండగానే ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం నీరసం వల్ల కళ్లు తిరిగి పడిపోవడంతో మరణించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు యువకుల నడుమ జరిగిన ఘర్షణతో మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం సాధారణ మరణంగా తేల్చారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top