చిన్నారిపై లైంగికదాడి కేసు: 103 ఏళ్ల వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్ష

103 Year Old Sentenced To 15 Years In Prison In Girl Molestation Case - Sakshi

 నేరస్తుడు రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ 

తిరువళ్లూరు(తమిళనాడు): చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ శతాధిక వృద్ధుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పూందమల్లికి చెందిన పరశురామన్‌ (103) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇతని ఇంట్లో ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య పిల్లలతో కలిసి అద్దెకు ఉండేవారు. ఈ నేపథ్యంలో 2018లో ఇంట్లో ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పిన పరశురామన్‌ ఒంటరిగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తల్లిదండ్రులకు చెబితే హత్య చేస్తానని బెదిరించాడు

చదవండి: Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?

అయితే బాలికకు రెండు రోజుల తరువాత ఆరోగ్య సమస్యలు రావడంతో అనుమానం వచి్చన తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలికపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం బాధితులు ఆవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరశురామన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్ర తీర్పు వెలువరించారు. బాలికపై లైంగిక దాడికి దిగిన పరశురామన్‌కు 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు 45 వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top