ఘోర రోడ్డు ప్రమాదం; 10 మంది మృతి

అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు- ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృతి చెందగా... మృతుల్లో చిన్నపాప కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటికి తీశారు. కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా కారులో అహ్మదాబాద్ జిల్లాలోని వతమాన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం