breaking news
Anand district
-
ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ బాల్స్.. తల పట్టుకున్న అధికారులు
Mysterious metal balls raining..ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు బయటకు రావడం కలకలం సృష్టించింది. గుజరాత్ వరుసగా ఇలాంటి గోళాలు పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, సురేంద్ర నగర్ జిల్లాలోని సాయిలా గ్రామంలో సోమవారం కొన్ని లోహపు గోళాలు కనిపించాయి. ఈ లోహపు గోళాలు అక్కడ పడిపోయాయని సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. కాగా, గోళాలు ఈకల రూపంలో తీగలుగా ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక, చాలా వరకు ఈ లోహపు గోళాలు నిర్మానుష్య ప్రాంతంలో ఒకే చోట పడిపోవడంతో అవి ఆకాశం నుంచే పడ్డాయన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో, ఈ వ్యవహారాన్ని తేల్చడానికి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ నిపుణులను సమాచారం అందించారు. ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ నిపుణులు అంతరిక్షంపై స్పేస్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ నిపుణులు లోహపు గోళాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇవి భూమికి సమీప కక్షలో తిరుగుతున్న శాటిలైట్ శకలాలే అయి ఉంటాయని వారు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. 'It's a bird. It's a plane...': Mysterious metal balls raining in Gujarat puzzles locals pic.twitter.com/RGKEpPQyoO — Times No1 (@no1_times) May 16, 2022 ఇదిలా ఉండగా.. కొద్ది రోజల క్రితం గుజరాత్లో ఆనంద్ జిల్లాలోని భలేజ్, ఖంబోలాజ్, రాంపుర గ్రామాల్లో సుమారు 5 కిలోల బరువున్న మెటల్ బాల్స్ మొదటిసారిగా ఆకాశం నుంచి భూమిపై పడ్డాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. Meteorite Or An Alien? Mysterious Metal Balls Fall From Space Video Goes Viral https://t.co/U3dhPxmofB — Trends302 (@Trends_302) May 13, 2022 ఇది కూడా చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్ -
ఘోర రోడ్డు ప్రమాదం; 10 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు- ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృతి చెందగా... మృతుల్లో చిన్నపాప కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటికి తీశారు. కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా కారులో అహ్మదాబాద్ జిల్లాలోని వతమాన్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం -
బాత్రూమ్ లో మొసలి ప్రత్యక్షం!
ఆనంద్: ఎక్కడో చెరువులో ఉండాల్సిన మొసలి బాత్రూమ్ లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఉహా కాకుండా అదే నిజమైతే ఆ ఇంట్లోవారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ ఘటన గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలోని భరత్ పటేల్ నివాసంలో చోటు చేసుకుంది. తన నివాసంలోని బాత్రూమ్ లో ఐదు అడుగుల మొసలి కనిపించగానే కుటుంబమంతా షాక్ కు గురయ్యారట. వెంటనే బాత్రూమ్ డోర్ కు తాళం వేసి సమాచారమందించడంతో ఇరుగుపొరుగు వారంతా భరత్ పటేల్ నివాసానికి పెద్ద ఎత్తున తరిలివచ్చారు. ఆతర్వాత ఫారెస్ట్ అధికారులు భరత్ పటేల్ ఇంటికి చేరుకుని.. ఓ పంజరంలో బంధించి మలతాజ్ గ్రామంలోని ఓ చెరువులో వదిలివేశారు. దాంతో భరత్ పటేల్ కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాత్రూమ్ లోకి మొసలి ఎలా వచ్చిందనది ఇప్పటికి అర్ధం కాని మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.