బాత్రూమ్ లో మొసలి ప్రత్యక్షం! | Gujarat family finds crocodile in bathroom | Sakshi
Sakshi News home page

బాత్రూమ్ లో మొసలి ప్రత్యక్షం!

Jul 30 2014 7:36 PM | Updated on Sep 2 2017 11:07 AM

బాత్రూమ్ లో మొసలి ప్రత్యక్షం!

బాత్రూమ్ లో మొసలి ప్రత్యక్షం!

ఎక్కడో చెరువులో ఉండాల్సిన మొసలి బాత్రూమ్ లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.

ఆనంద్: ఎక్కడో చెరువులో ఉండాల్సిన మొసలి బాత్రూమ్ లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.  ఉహా కాకుండా అదే నిజమైతే ఆ ఇంట్లోవారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ ఘటన గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలోని భరత్ పటేల్ నివాసంలో చోటు చేసుకుంది. 
 
తన నివాసంలోని బాత్రూమ్ లో ఐదు అడుగుల మొసలి కనిపించగానే కుటుంబమంతా షాక్ కు గురయ్యారట. వెంటనే బాత్రూమ్ డోర్ కు తాళం వేసి  సమాచారమందించడంతో ఇరుగుపొరుగు వారంతా భరత్ పటేల్ నివాసానికి పెద్ద ఎత్తున తరిలివచ్చారు. 
 
ఆతర్వాత ఫారెస్ట్ అధికారులు భరత్ పటేల్ ఇంటికి చేరుకుని.. ఓ పంజరంలో బంధించి మలతాజ్ గ్రామంలోని ఓ చెరువులో వదిలివేశారు. దాంతో భరత్ పటేల్ కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాత్రూమ్ లోకి మొసలి ఎలా వచ్చిందనది ఇప్పటికి అర్ధం కాని మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. 

Advertisement
 
Advertisement
Advertisement