breaking news
car-truck collision
-
ఘోర రోడ్డు ప్రమాదం; 10 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు- ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృతి చెందగా... మృతుల్లో చిన్నపాప కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటికి తీశారు. కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా కారులో అహ్మదాబాద్ జిల్లాలోని వతమాన్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం -
కారు, ట్రక్ ఢీ.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్ లోని భావ్నగర్ జిల్లా రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృతిచెందారు. శనివారం ఓ ట్రక్ డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై ఆర్ ఎన్ జింఝువాడియా తెలిపాడు. భావ్నగర్ నుంచి బోటాడ్ పట్టణానికి కారులో తిరిగివస్తుండగా భావ్నగర్ - అహ్మదాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతులు అష్రాఫ్ మన్కడ్ (40), రహిల్ ధందూకియా (25), హుస్సేన్ పాదర్శి (23), సుబాన్ బెన్ మురియా (35), ఫరిదా ధందూకియా (36)లుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపాడు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయిందని తెలుస్తోంది. ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి, పరారయ్యాడని అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.