అధికార పార్టీ అరాచకాలకు
వెన్నుచూపని జనం
బెదిరింపులు.. దాడులు.. దౌర్జన్యాలను సైతం లెక్కచేయని అభిమానం
పచ్చమూక అడ్డంకులను అధిగమించిన కుప్పం ప్రజానీకం
టీడీపీ నేతలు దొంగ ఓట్లు.. రిగ్గింగ్‌కు పాల్పడినా వైఎస్సార్సీపీ
తగ్గని ఓటింగ్ శాతం
కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఎంత ప్రజాదరణ ఉందో ఓటర్లు నిరూపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరని కూడా చూడకుండా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు కురిపించి మేము జగనన్న ఓటర్లమంటూ కుప్పం వాసులు వేలెత్తి చూపారు. ఈ మేరకు పరిషత్ పోరులో భారీగా ఓట్లు రావడం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. అడుగడుగునా ఆటంకాలు సృష్టించినప్పటికీ వైఎస్సార్సీపీకి పెద్దసంఖ్యలో ఓట్లు రావడంతో టీడీపీ నేతలు డీలా పడ్డారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
పోలింగ్ రోజున అరాచకం
కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ రోజున టీడీపీ నేతలు అరాచకాలు తెరతీశారు. కుప్పం మండంల నాయనూరులో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు ఓటేసేందుకు రాకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. కొందరిని పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని పోలింగ్ పూర్తయిన తర్వాత వదలిపెట్టారు. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న సెగ్మెంట్లలో పచ్చమూక మరింత రెచ్చిపోయింది. పోలింగ్ బూత్‌లలోకి చొరబడి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడింది. మొత్తం నియోజకవర్గంలోని 53 ఎంపీటీసీ సెగ్మెంట్లులో భారీ రిగ్గింగ్ చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసింది.
కౌటింగ్ కేంద్రాల్లో అక్రమాలు
నామినేషన్ల నుంచి పోలింగ్ వరుకు అష్టకష్టాలు పడి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు కౌటింగ్లోను ఇబ్బందులు తప్పలేదు. కౌటింగ్ ప్రారంభం నుంచి వైఎస్సార్ సీపీ ఏజెంట్లు, అభ్యర్థులను బయటకు తరిమివేశారు. భోజన విరామం సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు విభజించి రూమ్ నుంచి కౌటింగ్‌కు మరో రూమ్ మార్చేశారు. గుడుపల్లె మండలం గుండ్లసారం సెగ్మెంట్ అభ్యర్థి రేణుక భర్తను కృష్ణమూర్తి పొలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. రాళ్లబూదురుగు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిచారో.. ఓడారో కూడా చెప్పకుండా వేధించారు. మహిళా అభ్యర్థి కన్నీటి పర్యంతమైనా టీడీపీకి కొమ్ముకాస్తున్న అధికారులు కనికరించలేదు. చివరికి 6 ఓట్ల తేడాతో ఆమె ఓడినట్లు దుర్మార్గంగా ప్రకటించేశారు. ఎంకేపురం, 121 పెద్దూరు, అనికేరా , కోటాలూరు సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు నరకం చూపించారు.
మందస్తుగా హెచ్చరికలు
పరిషత్ ఎన్నికల్లో పోలీసు అధికారులు మందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కుప్పం మున్సిప ల్ ఎన్నికలల్లో 7వవార్డులో జరిగినా ఘటనలే పునరా వృతమవుతాయని బెదిరించారు. పోలీసులు, ఎన్నికల అధికారులు ఏకపక్షంగా టీడీపీ కోసమే పనిచేశారు.
వైఎస్సార్సీపీపై కుప్పం వాసుల అభిమానం ముందు అధికార పార్టీ అర్భాటం చిన్నబోయింది. పచ్చమూక అరాచకాలను అధిగమించి ఫ్యాన్ వైపే ప్రజానీకం మొగ్గుచూపింది. టీడీపీ గూండాల దాడులు.. దౌర్జన్యాలను దాటుకుని ఓటుతో తిరుగులేని సమాధానమిచ్చింది. పోలింగ్ రోజున సృష్టించిన ఆటంకాలను బేఖాతర్ చేసి జగనన్నకు జైకొట్టింది. పరిషత్ పోరులో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరగణానికి దిక్కుతోచని దుస్థితిని కల్పించింది. సజావుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే ఏం జరిగి ఉండేదో కళ్లకు కట్టేలా వైఎస్సార్సీపీపై ఆదరణ కురిపించింది.
వైఎస్సార్సీపీ తగ్గని ఆదరణ
మొన్న కుప్పం మున్సిపాలిటీలో ప్రజలు చూపించి ఆదరణ... ఇప్పుడు నిమోజకవర్గ స్థాయిలో కూడా కనిపించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రచారం చేసుకోనివ్వక పోయినా.. పార్టీ సానుభూతిపరులను ఓటింగ్‌కు రాకుండా అడ్డుపడినా.. జగనన్నపై ప్రజాభిమానాన్ని మాత్రం అధికార పార్టీ తగ్గించలేకపోయింది. నాలుగు మండలాల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులకు మొత్తం 45,640 ఓట్లు వచ్చాయి. కుప్పం మండలం వైఎస్సార్సీపీ అభ్యర్థికి 14,287 ఓట్లు, శాంతిపురం జెడ్పీటీసీ అభ్యర్థికి 14,729 ఓట్లు, రామకుప్పం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 8,429 ఓట్లు, గుడుపల్లె అభ్యర్థికి 8,195 ఓట్లు పడ్డాయి. వైఎస్సార్సీపీ తరఫున ఎలాంటి ప్రచారాలు లేవు, హంగులు, ఆర్భాటాలు లేవు.. ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసి తమ అభిమానం ప్రదర్శించారు. ఈ క్రమంలోనే మూడు మండలాల్లో 53 ఎంపీటీసీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగాయి. రామకుప్పం మండలంలో 15 ఏకగ్రీవాలు కావడంతో అక్కడ ఒక ఎంపీటీసీ సెగ్మెంట్‌కు మాత్రమే ఎన్నిక నిర్వహించారు. ఈ మేరకు అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీకి మొత్తం 38,917 ఓట్లు పడినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది. ఈ గణాంకాల ప్రకారం కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
బాబు ఇలాకాలో వైఎస్సార్సీపీకి తగ్గని ప్రజాదరణ
అడుగడుగునా అడ్డంకులు
కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అందులో భాగంగా రామకుప్పం మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో కనీసం నామినేషన్ వేయకుండా భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు టీడీపీకి చెందిన వారినే వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేయించి, అనంతరం ఉపసంహకరించుకున్నట్లు నాటకాలాడి రామకుప్పంలో 15 ఎంపీటీసీ సెగ్మెంట్లను ఏకగ్రీవం చేసుకున్నారు. శాంతిపురం మండలంలో సైతం నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ స్థానిక నేతలను అరెస్ట్ చేయించి నామినేషన్లకు రాకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తుంటే దాడులు చేశారు. గుడుపల్లె మండలం ఓన్ కోత్తూరు ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్‌ను ప్రచారం చేయకూడదని అడ్డుపడ్డారు. చివరకు ప్రచార వాహనాలకు సైతం అనుమతి ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించారు.


