టీటీడీకి 11 టన్నుల కూరగాయల వితరణ | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి 11 టన్నుల కూరగాయల వితరణ

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

పలమనేరు: మండలంలోని మొరం గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వై.రమేష్‌ తన మిత్రులతో కలిసి బుధవారం తిరుమలలోని వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి 11 టన్నుల కూరగాయలు వితరణ చేశారు. స్థానిక మార్కెట్‌ యార్డులో వాహనానికి పూజలు చేసి తిరుమలకు పంపారు. రమేష్‌ మాట్లాడుతూ తిరుమలకు వచ్చే లక్షలాది భక్తుల ఆకలి తీర్చుతున్న అన్నదాన పథకానికి తనవంతు సేవ చేయాలనే కూరగాయలు పంపించినట్టు తెలిపారు. టీటీడీ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీవారి భక్తులు కాబ్బల్లి రవీంద్ర, కూర్మాయి రవీంద్ర, నక్కపల్లి భాస్కర్‌రెడ్డి, మొరం బాబు, దేవేంద్ర రెడ్డి, మొరం ఎంపీటీసీ ఉమామహేశ్వర్‌ రెడ్డి, ఉప్పుశెట్టి, బుల్లెట్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

వయోజనులకు వరం

ఓపెన్‌ స్కూల్‌

– ఎస్పీ తుషార్‌ డూడి

చిత్తూరు కలెక్టరేట్‌ : వయోజనులకు ఓపెన్‌ స్కూల్‌ ఒక వరమని ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. ఆయన బుధవారం ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేస్తున్న హోమ్‌ గార్డులు ఓపెన్‌ స్కూల్‌ విద్యను సద్వినియోగం చేసుకుని ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి తమ విద్యార్హతలను పెంచుకోవాలని సూచించారు. విధులతో పాటు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇది సువర్ణ అవకాశమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ జయప్రకాష్‌నాయుడు, సీనియర్‌ అసిస్టెంట్‌ సల్లార్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement