తాగునీటి నాణ్యతకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

తాగునీటి నాణ్యతకు ప్రాధాన్యత

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

గ్రామాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి తాగునీటి ఎద్దడి నివారణకు 13 మండలాలపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణలో తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌తోపాటు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ కచ్చితంగా నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా శాంతిపురం, గుడుపల్లి, వీకోట, యాదమరి, పెద్దపంజాణి, కుప్పం, రామకుప్పం, పూతలపట్టు సహా జిల్లాలోని 13 మండలాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వసతి గృహాల్లో ప్రతి రెండు నెలలకొకసారి తాగునీటి నాణ్యతను పరీక్షించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. అలాగే ప్రతి మండలంలోనూ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ఇందులో మైనారిటీ, ఎస్‌సీ, ఎస్‌టీ కాలనీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌, డీఈలు, ఏఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement