– 8లో
సమాచార శాఖలో నిబంధనలను ఉల్లంఘిస్తు న్నారు. డీడీ వాహనాన్ని డమ్మీ ఇన్ఫ్లుయెన్సర్ యథేచ్ఛగా వినియోగిస్తున్నాడు.
16న జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ ఎంపిక పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3)ను పురస్కరించు కుని ఈ నెల 16న జి ల్లా స్థాయి పారా స్పో ర్ట్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాప్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 16వ తేదీ ఉదయం 9 గంటలకు చిత్తూరులోని మెసానిక్ గ్రౌండ్లో పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మండల స్థాయిలో ఎంపికై న దివ్యాంగ క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్ బాల్, పారా తై క్వాండో, టేబుల్ టెన్నిస్ క్రీడలు ఉంటాయని పే ర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే క్రీడాకారు లు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ తెలిపారు. నవంబర్ 14వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణతో వారోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులకు నివాళి అర్పిస్తామన్నారు. 17న కవి సమ్మేళనం, ఆటల పోటీలు, 18వ తేదీ ఉదయం సాహిత్య సదస్సు, 19న మహిళా దినోత్సవం, ఇందిరాగాంధీ జయంతి వేడుకలు, 20న డిజిటల్ గ్రంథాలయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్ర మం ఉంటుందన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు.


