నాయుడుపేటలో పోలీసులు, టీడీపీ నేతల అరాచకం | - | Sakshi
Sakshi News home page

నాయుడుపేటలో పోలీసులు, టీడీపీ నేతల అరాచకం

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● చంద్రబాబు పన్నాగాలు నమ్మకండి ● మంచి జరగాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటెయ్యండి ● జిల్లాలో 24 జెడ్పీటీసీ, 300 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ● పోటీలో 791 మంది అభ్యర్థులు ● మొత్తం 1,138 పోలింగ్‌ కేంద్రాలు

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

కౌటింగ్‌లోనూ కూటమి కుట్రలు

ఓటమిని జీర్ణించుకోలేక బరితెగించిన టీడీపీ గూండాలు

ఏజెంట్లు, అభ్యర్థులను గెంటేసి గెలిచినట్టు ప్రకటించుకున్న పచ్చ మూకలు

కుప్పంలో 2 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించినా ఆగని దౌర్జన్యాలు

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమాలు

సంఘమిత్ర ఎన్నికల ప్రచారం
కార్వేటినగరంలో సంఘమిత్ర మహేశ్వరి నిబంధనలకు విరుద్ధంగా కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు.

బుధవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

పాఠశాలలకు సెలవు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పరిషత్‌ ఎన్నికలు నిర్వహించనున్న రూరల్‌ ప్రాంతాల్లో బుధవారం, గురువారం సెలవులు ప్రకటించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు తప్పనిసరిగా సెలవులు ప్రకటించాలన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌, పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీల పరిధిలోని పాఠశాలలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయన్నారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ నెల 5వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోదలచిన ఉపాధ్యాయులకు ‘ఓడీ’ మంజూరు చేసినట్లు తెలిపారు. ఓడీ సౌకర్యం పొందే టీచర్లు విధిగా లీప్‌ యాప్‌లో ఎన్నికల విధుల ఆప్షన్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వేతనంతో కూడిన

సెలవు రేపు

చిత్తూరు కార్పొరేషన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు ఆయా సంస్థల యాజమాన్యాలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సహాయ కార్మిక కమిషనర్‌ కేశన్న స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గురువారం పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించామని వెల్లడించారు.

ప్రభుత్వ ఐటీఐలో

నైపుణ్య శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్‌ రవీంద్రరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద మూడు నెలలపాటు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ ఆపరేటర్‌ కోర్సులో శిక్షణ అందించనున్నట్లు వివరించారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల యువత అర్హులని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ అందజేస్తారని వెల్లడించారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 7396631623, 8500384812, 9160940479 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఇన్‌వాలిడ్‌ చేసి ఓడించారు!

పలమనేరు : టీడీపీ నేతల ఒత్తిడితోనే కౌంటింగ్‌ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఏడు ఓట్లను ఇన్‌వాలిడ్‌ చేసి తనను ఓడించారని 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కమాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్డులో టీడీపీ అభ్యర్థి కేవలం మూడు ఓట్లతో గెలిచినట్టు ప్రకటించారని ఆరోపించారు. రీకౌటింగ్‌ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తనకు న్యాయం చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య హితంగా జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేశారు. పురపాలక ఎన్నికల్లో అరాచకం సృష్టించారు. ఖాకీలను అడ్డంపెట్టుకుని దమనకాండ కొనసాగించారు. నామినేషన్ల పర్వం నుంచి దౌర్జన్య కాండ సాగించారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. మహిళల చీరలు లాగి.. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎన్నికలప్పుడూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఇది చాలదన్నట్టు కౌంటింగ్‌లోనూ అరాచకం సృష్టించారు. దాడులకు ఎదురొడ్డి.. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినా జీర్ణించుకోలేకపోయారు. అధికారులపై ఒత్తిడి పెంచి తామే విజయం సాధించినట్టు ప్రకటించుకున్నారు. వీటన్నింటినీ చూసి తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం.. ఏలుకోండి నారావారి రాక్షస సామ్రాజ్యం అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: మొన్న నామినేషన్లు.. నిన్న పోలింగ్‌.. నేడు కౌంటింగ్‌లో టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని జీర్ణించుకోలేని కూటమి నేతలు అక్రమాలకు తెగబడ్డారు. ఎన్నికల అధికారి విజేతని ప్రకటించినా.. కొన్ని ఓట్లను చెల్లనివిగా మార్చేసి టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పంలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో అధికారపార్టీ నేతలు బరితెగించారు. అడుగడుగునా అక్రమాలు.. దాడులు, దౌర్జన్యాలతో అరాచకం సృష్టించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలోని 3, 7 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను బయటకు గెంటేశారు. అనంతరం ఎన్నికల అధికారులపై ఒత్తిడిచేసి టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆందోళనకు దిగితే.. వారిపై పోలీసులను ప్రయోగించారు. పలమనేరు 34వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌ సల్మా విజయం సాధించారు. ఓటమిని జీర్ణియించుకోలేని టీడీపీ నేతలు రీకౌంట్‌కి పట్టుబట్టారు. నాలుగు పర్యాయాలు రీ కౌంటింగ్‌ చేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధే విజేతగా నిలిచారు. అయిలే డిక్లరేషన్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారు. నగరి 18వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి డిక్లరేషన్‌ ఇచ్చారు. అదే విధంగా 38వ వార్డులోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ రెండింటిలోనూ రీకౌంటింగ్‌కి టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. రీకౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించినా దౌర్జన్యం సాగించారు.

ఫలితాలు వెల్లడించడంతో తీవ్ర జాప్యం

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైన కొద్దిసేపటికే వెంకటగిరి నుంచి 13వ వార్డు అభ్యర్థి తలపల చెంచు మల్లికార్జున్‌ విజయం సాధించడంతో వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది. ఆ వెంటనే కుప్పం, నగరి, నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆ తరువాత మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల తరువాత వరకు ఫలితాలు ప్రకటించడంలో ఆలస్యంగా చోటు చేసుకుంది. ఈ ఆలస్యం వెనుక అధికారపార్టీ నేతల ఒత్తిడి ఉందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత ప్రకటించిన ఫలితాలు.. ఎక్కువ శాతం ఏకపక్షంగా వెల్లడైనట్లు చెబుతున్నారు. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలైతే.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే ఉదయం 11.45కి ప్రకటించారు. తర్వాత సాయంత్రం 5 గంటలపైన కౌంటింగ్‌ ఫలితాలు ప్రకటించడం ప్రారంభించారు. సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటించకపోవడం వెనుక కుట్ర దాగి ఉందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

గెలిచినా..

ఓటుతో కూటమికి బుద్ధి చెబుదాం

రేపే పరిషత్‌ పోరు

బైరెడ్డిపల్లెః మోసపూరిత కూటమి ప్రభుత్వానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుదామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బైరెడ్డిపల్లెలో మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు రుణమాఫీ చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.18 వేలు ఇచ్చిన ఘనత, గ్రామీణ ప్రాంత పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయన్నారు. గత ప్రభుత్వంలో నామమాత్రంగా ధరలను పెంచితే బాదుడే బాదుడు అంటూ రోడ్డపైకి వచ్చిన టీడీపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ధరలకు ఏ పేరు పెడుతారని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెప్పి.. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రజలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ మొగసాల రెడ్డెమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, మాజీ ఎంపీపీలు మొగసాల రెడ్డెప్ప, మొగసాల శోభ, శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆర్‌.కేశువులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దయానందగౌడు, జెడ్పీటీసీ అభ్యర్థి కార్తికేయన్‌ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం

టీడీపీ అక్రమాల గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. డీఎస్పీ, సీఐ తమ బృందంతో మాజీ ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ గూండాలు చుట్టుముట్టి ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. మాజీ ఎమ్మెల్యేని తోసుకుంటూ వెళ్లి బలవంతంగా పోలీసు జీపులోకి నెట్టేసి.. దొరవారిసత్రం స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో

అడుగడుగునా అరాచకాలు

తిరుపతి విషయానికి వస్తే.. 33వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎన్‌.పునీత 58 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపుని ప్రకటించడానికి వీల్లేదంటూ.. అభ్యర్థి, ఏజెంట్‌ని బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని బయటకు వచ్చిన ఏజెంట్‌ శివకుమార్‌ కౌంటింగ్‌ కేంద్రంలో జరిగిన టీడీపీ అక్రమాలను బయటపెట్టారు. ఏజెంట్‌ వీడియో వైరల్‌ కావడంతో టీడీపీ నేతలు యూటర్న్‌ తీసుకోవడంతో సాయంత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ ఇచ్చారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం సాఽధించారు. అదే విధంగా 13 వార్డు అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని పోలీసులు, టీడీపీ మూకలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. నాయుడుపేట మున్సిపాలిటీ 2వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాధవి 3 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల అధికారి కూడా ప్రకటించారు కూడా. టీడీపీ అభ్యర్థి పసల వాణి భర్త ఎన్నికల అధికారులను బెదిరించి రీ కౌంటింగ్‌కి డిమాండ్‌ చేశారు. ఆ రీకౌంటింగ్‌లో 9 ఓట్లు చెల్లనివిగా చూపించి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement