ఆటంకాలు అధిగమించి.. విజయబావుటా ఎగురవేసి | - | Sakshi
Sakshi News home page

ఆటంకాలు అధిగమించి.. విజయబావుటా ఎగురవేసి

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

విజయకేతనం ఎగురవేసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ తిరుపతి కార్పొరేషన్‌ మేయర్‌గా జేబీ శ్రీనివాస్‌ వెంకటగిరి, పుత్తూరులో కూటమి అభ్యర్థుల గెలుపు

పుత్తూరు చైర్మన్‌గా ఏలుమలై

పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి డీఎన్‌ ఏలుమలై 10,144 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన డి జయప్రకాష్‌ మీద ఆయన గెలుపొందారు. పుత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాలుగు వార్డులను కై వసం చేసుకొంది. ఆ పార్టీ తరఫున ఎస్‌.ఇలంగోవన్‌, పి.సావిత్రమ్మ, పి.లత, డి.గోపినాథ్‌ గెలుపొందారు. మొత్తం 36 వార్డులకు గాను, టీడీపీ 29 స్థానాలతో పాటు ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో మొత్తం 30 స్థానాలను దక్కించుకొంది. రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు.

సాక్షి, తిరుపతి: నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. తీవ్ర నాటకీయ పరిణామాల అనంతరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ గెలుపొందినట్టు ఎన్నికల అఽధికారులు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి షాకీరాపై 1,187 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన తంబిరెడ్డి గెలుపును అధికార పార్టీ జీర్ణించుకోలేకపోయింది. పదేపదే రీ కౌంటింగ్‌ అడుగుతూ కౌంటింగ్‌ కేంద్రంలో తీవ్ర అలజడి సృష్టించింది. మరోవైపు పోలీసులు అఽధికార పార్టీ తరఫున బరితెగించారు. ఎట్టకేలకు ప్రజాతీర్పును గౌరవించి నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ గెలిచినట్టు ప్రకటించారు. నాయుడుపేటలో మొత్తం 32 వార్డులుండగా అందులో 13 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, 14 చోట్ల టీడీపీ, నాలుగు చోట్ల బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అభ్యర్థుల్లో బూదూరు శ్రీలక్ష్మి, పాలేటి నాగార్జున, రాయపు సరిత, తీపలపూడి నాగరత్నం, సాతూవతి మరియమ్మ, నాగిరెడ్డి కల్పన, కావేరిపాకం అశోక్‌కుమార్‌, గందవళి అరుణ, దారా రవి, నెమలి లత, కలిశెట్టి మురళి, నెమలి లత, మైలాపూర్‌ మాధవి ఉన్నారు.

వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా

దొంతు శారద

వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి దొంతు శారద గెలుపొందారు. సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దీవెనపై 10,636 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 36 వార్డులకు గాను నాలుగు వార్డులు వైఎస్సార్‌సీపీ, 29 టీడీపీ, రెండు బీజేపీ, ఒకచోట జనసేన అభ్యర్థులు గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లలో జలగం కామాక్షి, తలపల మల్లికార్జున, మేరువ ఇందిరమ్మ, బీరం వసంత కుమార్‌ ఉన్నారు.

సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా

పిట్ల సుహాసిని

సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పిట్ల సుహాసిని (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోడి విమలకుమారిపై 8,784 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొత్తం 32 వార్డులకు గాను రెండు స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా పోలింగ్‌ జరిగిన 30 వార్డుల్లో మూడు చోట్ల వైఎస్సార్‌సీపీ, 24 చోట్ల టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ గెలుపొందింది. వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన వారిలో కలత్తూ రు శేఖర్‌రెడ్డి,ఊటి మాధురి, పొన్న మంజుల ఉన్నారు.

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

నాయుడుపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా శక్తివంచన లేకుండా కృషిచేస్తా. పేట ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. అందరికీ అందుబాటులో ఉంటూ, మీ కుటుంబంలో ఓ వ్యక్తిగా మెలుగుతా. కష్టంలో కన్నీళ్లు తుడుస్తూ అండగా నిలుస్తా. నాపై నమ్మకం ఉంచి విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – తంబిరెడ్డి రాజేశ్వరమ్మ,

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, నాయుడుపేట

తిరుపతి మేయర్‌గా జేబీ శ్రీనివాస్‌

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మన్నెం శ్రీనివాసప్రసాద్‌(జేబీ శ్రీనివాస్‌) గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వాసుయాదవ్‌కు 33,355 ఓట్లు రాగా జేబీ శ్రీనివాస్‌కు 94,937 ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన 1,36,006 ఓట్ల లో 3,149 ఓట్లు ఇన్‌ వ్యాలిడ్‌ కాగా 1,389 మంది నోటాకు వేయడం విశేషం. పోస్టల్‌ బ్యాలెట్‌లో సైతం 478 ఓట్లకు గాను 44 ఓట్లు ఇన్‌వ్యాలిడ్‌ అవ్వగా 13 ఓట్లు నోటాకు పడ్డాయి. మొత్తం 66 డివిజన్లకు గాను రెండు స్థానాలు టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా పోలింగ్‌ జరిగిన 64 డివిజన్లలో టీడీపీ 36, జనసేన 19, వైఎస్సార్‌సీపీ మూడు, బీజేపీ మూడు, స్వంతంత్ర అభ్యర్థులు మూడు చోట్ల గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అభ్యర్థుల్లో వెంకటేశ్వర్లు, పునీత, శ్రావణి ఉన్నారు.

నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైఎస్సార్‌సీపీదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement