– 8లో
మృత్యువులోనూ వీడని స్నేహం
నగరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
పలమనేరు : పలమనేరు మున్సిపాలిటీ కౌంటింగ్ భాగంగా మంగళవారం 34వ వార్డు ఓట్లను ఆరు పర్యాయాలు లెక్కించారు. ఈ ఎన్నికల్లో 34 వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ సల్మా తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కీర్తి జావీద్‌పై 15 ఓట్లతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు తొలుత ప్రకటించారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు వెంటనే కుట్రలకు తెరతీశారు. ప్రధానంగా స్థానిక టీడీపీ నేత ఆర్‌వీ బాలాజీ ఎలాగైనా సల్మాను ఓడించి కీర్తి జావీద్‌ను గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నట్టు కనిపించారు. దీంతో ఆయన ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాలుగు దఫాలు రీకౌంటింగ్ చేయిస్తూ మెజారిటీ తగ్గిస్తూ వచ్చారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ తతంగం సాగింది. దీనిపై ఆగ్రహించిన సల్మా ఇదేమి అన్యాయమంటూ నిలదీశారు. .తమ పార్టీ అభ్యర్థి గెలిచినా ఈ అన్యాయం ఏంటంటూ వైఎస్సార్‌సీపీ క్యాడర్ సైతం చేరుకుంది. అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కానీ, సల్మా మాత్రం కౌంటింగ్ కేంద్రం వద్దే నిరసనకు దిగింది. ఇది గమనించిన సీఐ మోహన్‌రెడ్డి సైతం ఆమెకు జరిగింది అన్యాయమని తెలిసి మథనపడినట్టు తెలిసిందిది. చివరకు ఆరు దఫాలు రీకౌంటింగ్ చేసినా ఏమీ చేసేందుకు వీలుగాక 15 ఓట్ల మెజారిటీని రెండు ఓట్లకు తీసుకువచ్చి ఎట్టకేలకు సల్మా గెలిచినట్టు అధికారులు డిక్లరేషన్ ఇచ్చారు. పోరాటపటిమను చూపిన సల్మా తెగువను అందరూ ప్రశంసించారు. ఈ ఇదిలా ఉండగా షేక్ సల్మా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరుసగా కౌన్సిలర్‌గా గెలిచారు. ఐదోసారీ విజేతగా నిలిచారు.


