చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని బృందావన్ పాఠశాల విద్యార్థి యశ్విన్ శ్రీసాయి జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కరస్పాండెంట్ శైలజాకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్–17 బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారన్నారు. వాయల్పాడులో నిర్వహించిన ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. భవిష్యత్లో మరింత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని కోరారు. ప్రతిభ చూపిన విద్యార్థిని డైరెక్టర్ ప్రియతేజ, ప్రిన్సిపల్ సుబ్రమణ్యం అభినందించారు.


