ఎన్నికలెందుకు నామినేట్‌ చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలెందుకు నామినేట్‌ చేసుకోండి

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● వైఎస్సార్‌సీపీ నాయకులు, ఏజెంట్లను బైండోవర్‌ చేసుకున్నారు ● అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌, దౌర్జన్యాలకు పాల్పడ్డారు ● విజయానందరెడ్డి ఆవేదన

చిత్తూరు కార్పొరేషన్‌: ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతవారణంలో జరగాల్సిన ఎన్నికలను అలజడి సృష్టించారని వైఎస్సార్‌ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా ఆదివారం పలువురు వైఎస్సార్‌ సీపీ డివిజన్‌ ఇన్‌చార్జిలు, ఏజెంట్లను పోలీసులు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న విజయానందరెడ్డి మేయర్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌, మొదలియార్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌తో కలిసి రెండో పట్టణ పోలీసుల వద్దకు వెళ్లి మాట్లాడారు. నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దౌర్జన్యాల మధ్య ఎన్నికలు నిర్వహించడం ఎందుకని, నేరుగా నామినేట్‌ చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. పలువురు ఏజెంట్లను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మిగిలిన ఏజెంట్ల ఽధ్రువీకరణ పత్రాలను అధికార పార్టీ నాయకులు పోలింగ్‌ కేంద్రాల వద్ద చింపివేశారని పేర్కొన్నారు. కొందరిని కొట్టి బయటకు పంపించారని తెలిపారు. పోలీసుల ఎదుటే తమ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతురన్నా అడ్డుకోలేదన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద గుమికూడిన అధికార పార్టీ నాయకులను పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారని విమర్శించారు. దొంగ ఓటర్లను దర్జాగా పోలింగ్‌ కేంద్రంలోకి పంపారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు ఉండడంతో పలువురు ఓట్లు వేయడానికి రాలేదన్నారు. మధ్యాహ్నం వరకు పోలింగ్‌ శాతం పెద్దగా లేకపోయినా, తర్వాత రిగ్గింగ్‌లకు పాల్పడడంతో ఓటింగ్‌ శాతం పెరిగింద న్నారు. ఎన్ని దాడులు చేసినా ధైర్యంగా నిలబడిన నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలకు హాట్సాప్‌ అని తెలిపారు. వారికి రుణపడి ఉంటామని, భగవంతుడు మనకు సమయం ఇస్తాడని, గుణపాఠం చెబుతామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement