ముగిసిన అంతర్జాతీయ మూట్‌ కోర్టు పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అంతర్జాతీయ మూట్‌ కోర్టు పోటీలు

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

తిరుపతి సిటీ: తిరుపతిలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ గ్లోబల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో మూడురోజులుగా ఫియట్‌ జస్టీషియా పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ న్యాయ మూట్‌ కోర్టు పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 ప్రముఖ విశ్వవిద్యాలయాలు, న్యాయ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్‌ ఆర్‌ తిప్పారెడ్డి మాట్లాడుతూ న్యాయ విద్యార్థుల్లో న్యాయ పరిశోధన, న్యాయపరమైన వాదనా పటిమ, న్యాయ నివేదికల తయారీ, విశ్లేషణాత్మక ఆలోచనా విధానం, న్యాయస్థానాల్లో వాదించే నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలు, దేశాల బాధ్యతలు, అంతర్జాతీయ న్యాయ పరిధి తదితర సమకాలీన అంశాలపై మూట్‌ కోర్టు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.1,35,000 నగదు బహుమతులు, ట్రోఫీని, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి వీఆర్‌కే కృష్ణసాగర్‌, విశ్రాంత న్యాయమూర్తి ఆన్సర్‌ బాష, ప్రొఫెసర్‌ టీవీ సుబ్బారావు, సాంబశివరావు, ప్రిన్సిపాల్‌ బిజయ్‌కుమార్‌ బెహెరా పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

పుల్లంపేట : మండలంలోని వత్తలూరు పంచాయతీ దేవసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు తల్లెం బాలసుబ్రమణ్యంరెడ్డి, పట్టెం సుబ్రమణ్యం వారి అనుచరులు వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం జగనన్నతోనే సాధ్యమని భావించి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు. నేతలు ముద్దా రంజిత్‌రెడ్డి, మూగ వెంకటరెడ్డి, తల్లెం సుధీర్‌రెడ్డి, పాపిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రెడ్డెయ్యరెడ్డి, ప్రహ్లాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement