జగనన్న చేసిన అభివృద్ధే గెలుపు బాట | - | Sakshi
Sakshi News home page

జగనన్న చేసిన అభివృద్ధే గెలుపు బాట

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● స్థానిక ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రజలకిచ్చిన సంక్షేమ ఫలాలు, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆదివారం పెనుమూరు మండలం కలవకుంట సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మహా సముద్రం దయాసాగర్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి నిరీషారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థితో కలసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలతో ఓటర్లను అభ్యర్థించారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి తమ అభ్యర్థులను గెలిపించలాని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువై ఎక్కడ చూసినా బాలికలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహా సముద్రం దయాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ, మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వ హయాంలో కళత్తూరు నారాయణస్వామి పులివెందుల తరహాలో అభివృద్ధి చేశారని, అందులో కలికిరి దేవస్థానాన్ని టీటీడీలో విలీనం చేయడం, బస్టాండును కోట్లాది రూపాయలతో నవీకరించారని, రూ.192 కోట్లతోఎన్టీఆర్‌ జలాశయ కింద ఉన్న చెరువులను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కింద చెరువుల ఆధునీకరణ చేశారన్నారు. అలాగే, ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదన చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement